డాటా కేసులో తెలంగాణ సంచలన నిర్ణయం..? ఇక బాబుకు చుక్కలేనా..?

Chakravarthi Kalyan

ఏపీ డేటా చోరీ కేసులో తెలంగాణ సర్కారు  సంచలన నిర్ణయం తీసుకుంది. డేటా చోరీ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించింది. ప్రత్యేక సిట్ ఏర్పాటు చేస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇంచార్జ్‌గా వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్రను నియమించారు.

 



స్టీఫెన్ రవీంద్రతో పాటు, సిట్ బృందంలో సైబర్ క్రైమ్స్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ రవి కుమార్, ఏసీపీ శ్రీనివాస్, మరో ఇద్దరు ఇన్ స్పెక్టర్లు ఉన్నారు. జంట కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు మొత్తం సిట్‌కు బదిలీ కానుంది. డీజీపీ కార్యాలయంలోనే సిట్‌కు సంబంధించి ప్రత్యేక చాంబర్ కేటాయించారు.



ఈ కేసు దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న స్టీఫెన్ రవీంద్రకు పోలీస్ శాఖలో మంచి పేరుంది. నిప్పక్షపాతంగా.. చురుగ్గా దర్యాప్తు చేస్తారని ప్రతీతి. కాకపోతే.. ఇంత కీలక బాధ్యతకు స్టీఫెన్ రవీంద్రను ఎంపిక చేయడం కొందరికి ఆశ్చర్యం కూడా కలిగిస్తోంది.

 



ఎందుకంటే.. తెలంగాణ ఉద్యమ సమయంలో స్టీఫెన్ రవీంద్ర టీఆర్ ఎస్ కార్యకర్తలను బాగా ఇబ్బందిపెట్టారు. ఓయూ ఉద్యమం సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కాకపోతే.. అదంతా వృత్తిలో  భాగమేనని తెలంగాణ సర్కారు పెద్దలు భావించి ఉండాలి. స్టీఫెన్ పనితీరును పరిశీలించే ఈ కీలక బాధ్యత ఇచ్చి ఉండాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: