ఆడు జీవితం: అక్కడ కూడా మెప్పిస్తుందా?

Purushottham Vinay
తెలుగులో సలార్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం). ఈ సినిమాని అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ డైరెక్ట్ చెయ్యగా..అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ రచయిత బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమా రాగా.. సర్వైవల్ అడ్వెంచర్‌గా వచ్చిన ఈ మూవీ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మలయాళంలో టాప్ 5 సినిమాల్లో నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతుంది.తాజాగా ఈ మూవీ ఓటీటీ అనౌన్స్‌మెంట్ వచ్చింది కానీ డేట్ మాత్రం వెల్లడించలేదు. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో త్వరలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించారు.


ఈ మూవీ కథ విషయానికి వస్తే.. 1990లో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఇక ఈ సినిమా పూర్తిగా ఎడారిలో తెరకెక్కిన మొదటి భారతీయ సినిమాగా ఈ సినిమా రికార్డు సాధించింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్. రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందించాడు.ఇక ఈ సినిమా తీసేందుకు క్రూ మొత్తం కూడా బాగా కష్టపడ్డారు.అసలు ఈ సినిమాలో క్యారెక్టర్ సరిగ్గా వచ్చేందుకు హీరో పృథ్వీరాజ్ ఏకంగా 31 కేజీలు బరువు తగ్గారట.ఈ 'ఆడు జీవితం' సినిమా.. దాదాపు 16 ఏళ్ల తర్వాత సెట్స్ పైకి వచ్చింది. 16 ఏళ్ల నుంచి ఈ మూవీ పై వర్క్ చేసి.. 2018లో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత కరోనా, అదే టైంలో సినిమా యూనిట్ మొత్తం కూడా ఎడారిలో దాదాపు మూడు నెలలు చిక్కుకుపోవడంతో సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత దాదాపు ఏడాది పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహించారట. ఇంత కష్టపడి తీసిన ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. ఇక ఓటిటిలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: