ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తే జగన్ కు తిరుగులేనట్లే..!

Vasishta

ఏపీలో వైసీపీ మాంఛి జోరు మీదుంది.. అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా టీడీపీ కంటే పైచేయి సాధించినట్లయింది. దీనికి తోటు ఇండియా టుడే సర్వేలో టీడీపీ కంటే మెరుగ్గా ఉండడం, అధికారంలోకి రావడం ఖాయమని తేలడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందానికి అవధుల్లేవ్.!

 

మేడా మల్లికార్జున రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్, రవీంద్ర .. ఇలా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను చేర్చుకోవడంతో వైసీపీ పరిస్థితి మెరుగైంది. ఇద్దరు బలమైన కాపు నేతలను తమవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయిన జగన్ .. ఏపీలో కాపులంతా తమవైపు ఉన్నారనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇదే సంకేతాలను ఎన్నికల వరకూ తీసుకెళ్లగలిగితే వైసీపీకి మేలు జరగడం ఖాయం.

 

ముఖ్యంగా ఉత్తరాంధ్రలో తెలుగుదేశంపార్టీకి తొలిదెబ్బ అవంతి శ్రీనివాస్ ద్వారా తగిలింది. టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో వైసీపీ వైపు అందరి చూపూ మళ్లింది. అవంతి శ్రీనివాస్ కు టీడీపీలో సీట్ దక్కే పరిస్థితి లేకపోవడంతోనే ఆయన పార్టీ వీడారనే ఊహాగానాలు వినిపిస్తున్నా.. విశాఖ జిల్లాలో వైసీపీకి మాత్రం బలం చేకూరినట్లే! అవంతి శ్రీనివాస్ కాపు సామాజిక వర్గంలో బలమైన నేత కాకపోయినా, కాస్తోకూస్తో ఇంపాక్ట్ చూపించగలరు. ఇక ఆమంచి కృష్ణమోహన్ మాత్రం కాపుల్లో బలమైన ముద్ర వేయగలరు. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన ఆమంచి ఈసారి కూడా గెలవడం పక్కా అనే సంకేతాలు వెలువడుతున్నాయి.

 

హైదరాబాద్ నుంచే జగన్ చక్రం తిప్పుతున్నారు. పలువురు నేతలు హైదరాబాద్ లోటస్ పాండ్ కు వెళ్లి జగన్ తో మంతనాలు సాగిస్తున్నారు. రేపో మాపో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, తోట త్రిమూర్తులు కూడా వైసీపీ గూటికి చేరడం ఖాయమనే సంకేతాలు వెలువుడుతున్నాయి. అదే జరిగితే టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే! కొంతమంది నేతలు వెళ్లిపోతున్నా టీడీపీ నుంచి పెద్దగా స్పందన ఉండట్లేదు. అలాంటి వాళ్ల గురించి పెద్దగా పట్టించుకోవద్దని పార్టీ శ్రేణులకు కూడా చంద్రబాబు సూచిస్తున్నారు. కానీ కొంతమంది నేతలను మాత్రం వెళ్లొద్దని పదేపదే రిక్వస్ట్ చేస్తున్నారు. వీలైనంత వరకూ వాళ్లను వెళ్లనీయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు.

 

ఏదైతేనేం.. జగన్ మాత్రం స్పీడ్ పెంచారు. అధికార పార్టీ నేతలను తమవైపు లాక్కోవడం ద్వారా పైచేయి సాధించారు. ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయగలిగితే అధికారం చేపట్టడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: