వ్యూహాత్మకంగా జగన్ ..!!

Satya
పాఠాలు అన్నవి జీవితంలో అందరికీ అవసరం. వాటిని నేర్చుకుని ముందుకు సాగితే తరువాత జీవితం బాగుంటుంది. రాజకీయ నాయకుల విషయానికి వస్తే వారు ఎప్పటికపుడు అన్నీ తెలుసుకుంటూ ముందుకుసాగాలి. వారికి ప్రతీదీ ప్రయోగమే. ప్రతీ విషయంలోనూ పొరపాట్లు లేకుండా చూసుకోవాల్సిందే. అడుగులు గట్టిగా పడుతున్నాయా లేదా అన్నది ఆలోచన చెయాల్సిందే.


ఆ తప్పులపైన  :


గతసారి ఎన్నికల్లో వైసీపీ చాలా పొరపాట్లు చేసింది. అందువ‌ల్లనే అధికారానికి దూరమైపోయింది. ముఖ్యంగా  పార్టీ నిర్మాణం పక్కాగా లేకపోవడం, బూతు లెవెల్లో చేతులెత్తేయడంతో పోటీలో ఉన్న మరో పార్టీకి అది బాగా కలసివచ్చింది. మేమే గెలిచేస్తున్నాము అన్న అతి విశ్వాసం కూడా వైసీపీని బొక్క బోర్లా పడేసింది. చూస్తూండగానే అయిదేళ్ళు గడచిపోయాయి. మళ్ళీ ఇపుడు ఎన్నికల సమరం మొదలవుతోంది. వైసీపీ ఇపుడు జాగ్రత్తగానే అడుగులు వేస్తోంది. గతసారి తప్పులను ఒకటికి రెండు మార్లు సరిచూసుకుంటోంది.


బూత్ కమిటీలే కీలకం :


ఇక వైసీపీ బూతు లెవెల్లో కమిటీలపైన ద్రుష్టి సారించింది. ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏపీలో స్వీప్ చెస్తుందని మొత్తానికి మొత్తంగా ఎంపీ సీట్లు, అసెంబ్లీ సీట్లు  ఆ పార్టీ ఖాతాలో పడతాయని ఓ వైపు సర్వేలు చెబుతున్నా  వైసీపీ అధినేత జగన్ మాత్రం వాటిని పక్కన పెడుతూ తనదైన కార్యాచరణను సిధ్ధం చేసుకుంటున్నారు. బూతు స్థాయిలో పార్టీకి ఓట్లు పడేలా యంత్రాంగాన్ని సిధ్ధం చేస్తున్నారు. దానిపైనే ఇపుడు ఆయన చూపు మొత్తం ఉంది.


సమర శంఖారావం :


జగన్ ఇపుడు సమర శంఖారావం పేరిట పొలింగ్ బూతు లెవెల్ క్యాడర్ తో సమావేశాలు పెడుతున్నారు. నిజానికి ఇది చాలా మంచి పరిణామం. ఇన్నాళ్ళు ప్రజలతో. నేతలతోనే జగన్ మీటింగులు పెడుతూ వచ్చారు.             పార్టీకి అసలైన యంత్రాంగం గురించి కొంత అశ్రద్ధ జరిగిన మాట వాస్తవం. ఇపుడు దాని మీద ద్రుష్టి కేంద్రీకరించడం ద్వారా జగన్ యుధ్ధాని రెడీ అంటున్నారు. మొత్తం పదమూడు జిల్లాల్లో ఉన్న బూతు లెవెల్ కమిటీలతో జగన్ మీటింగులు ఉంటాయి. నేరుగా వారితో ఆయన ఇంటరాక్ట్ అవుతారు. వారి అభిప్రాయానలు తీసుకుంటారు. తాను సలహాలు ఇస్తారు. మొత్తానికి దిశా నిర్దేశం చేస్తారు.


సీమ నుంచి మొదలు :


ఈ సమర శంఖారావం సభలు సీమ జిల్లాల నుంచి జగన్ మొదలు పెడుతున్నారు. ఫిబ్రవరి 4 నుంచి మూడు రోజుల పాటు తిరుపతి, కడప, అనంతపురంలలో ఈ సమావేశాలు ఉంటాయి. ఆ తరువాత మిగిలిన జిల్లాలు కూడా జరుగుతాయి. మొత్తానికి  ఫిబ్రవరి నెల అంతా జగన్ బూతు కమిటీల మీదనే ద్రుష్టి పెట్టబోతున్నారు. ఎన్నికల్లో ఒక్కో ఓటు చాలా కీలకం కాబట్టి పార్టీ క్యాడర్ ని పటిష్టం చేయాలను జగన్ భావించడం మంచి విషయం. నిజానికి జగన్ ఫిబ్రవరిలో బస్సు యాత్ర అనుకున్నారు, కానీ ఇపుడు బూత్ లెవెల్ మీటింగుల ద్వారా ఆయన పార్టీనే సన్నధ్ధం చేయాలనుకుంటున్నారు. దీని వల్ల వైసీపీ గతంలో చేసిన పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా తమ ఓట్లను బ్యాలెట్ బాక్సుల్లో వేయించుకోగలిగితే విజయం దక్కినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: