రైతులకు శుభవార్త తెలియజేసిన చంద్రబాబు..!

KSK
ఎన్నికలు వస్తున్న క్రమంలో ఒక పక్క సంక్షేమ ఫలాలు సామాన్యులకు అందిస్తూ మరోపక్క 2014 ఎన్నికలలో ఎవరి వల్ల అయితే తాను అధికారంలోకి వచ్చారు వారి గురించి కూడా ఆలోచిస్తూ వారికి ప్రభుత్వపరంగా అనగా రైతులకు కూడా ప్రభుత్వం నుండి సహాయం అందేలా సంచలన ప్రకటనలు చేస్తున్నారు చంద్రబాబు.


ప్రస్తుతం రాష్ట్రంలో తనపై తన పార్టీపై ప్రత్యర్థి పార్టీల ఆరోపణలు చేస్తున్న వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయానికి ప్రస్తుతం ఇస్తున్న ఏడు గంటల విద్యుత్‌ను 9 గంటలకు పెంచుతున్నట్లు ప్రకటించిన సియం చంద్రబాబు దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.


ప్రస్తుతం 10,831 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరమవుతుండగా..తాజా నిర్ణయంతో మరో 2800 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరమని విద్యుత్‌ శాఖ అంచనా. వ్యవసాయ రంగానికి సబ్సిడీ విద్యుత్‌ సరఫరా చేయడానికి ప్రభుత్వం రూ. 6,030 కోట్లు ఖర్చు చేస్తుంది. తాజా నిర్ణయంతో మరో రూ. 1200 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు.


రైతులకు సౌర విద్యుత్‌తో నడిచే 16 లక్షల పంపుసెట్లను రాష్ట్ర వ్యాప్తంగా అందిచాలన్నది ప్రభుత్వ లక్ష్యం...అని పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు చేసిన ప్రకటనలపై రాష్ట్ర రైతాంగం ఎంతగానో సంతోషించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: