జగన్ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో రికార్డులు ...!

Prathap Kaluva

సాధారణంగా పొలిటికల్ న్యూస్ యూట్యూబ్ లో అతి తక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. ఎక్కువగా సినిమా ల కు సంబంధించి న్యూస్ మాత్రమే టాప్ లో ట్రెండ్ అవుతుంటాయి. అయితే టీవీ 9 కి జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూ టాప్ # 10 లో ట్రెండ్ అవుతుంది. టీవీ 9కు జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూ పాలిటిక్స్ కు సంబంధించిన ఏకైక అంశం. మరే పొలిటికల్ ఇష్యూకు సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్ ఇండియా ట్రెండింగ్స్ లో టాప్ లో లేవు. జగన్ ఇంటర్వ్యూ నంబర్ టెన్ ఆన్ ట్రెండింగ్ గా సాగుతోంది.


కీలక అంశాలకు సంబంధించి జగన్ చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన స్పష్టతలు.. ఇంటర్వ్యూలో ఆసక్తిదాయకమైన అంశాలుగా నిలుస్తున్నాయి. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ప్రతిసారీ విజయసాయిరెడ్డికి ఎలా దొరుకుతుంది? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు జగన్ కౌంటర్ ఆసక్తిదాయకంగా ఉంది. విజయసాయి రెడ్డి ఎన్నిసార్లు ప్రధానిని కలిశాడో చెప్పండి.. అని జగన్ ఎదురు ప్రశ్నించే సరికి యాంకర్ నీళ్లు నమలాల్సి వచ్చింది.


ఇక తెలంగాణలో కేసీఆర్ కు సపోర్ట్ చేశారు కదా.. పోటీలో నిలవకుండా కేసీఆర్ కు హెల్ప్ చేశారు కదా.. అనే అంశంపై కూడా జగన్ కౌంటర్ అదిరింది. ‘మేం పోటీచేసి ఉంటే.. సొంత నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవగలిగేవాడా? నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమయ్యేది? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏమయ్యేది?” అని జగన్ ప్రశ్నించాడు. తాము పోటీచేసి ఉంటే కాంగ్రెస్ ఓట్లను చీల్చి.. ఆ పార్టీకి నష్టంచేసే వాళ్లం కాదా? అని జగన్ ప్రశ్నించడం ఆసక్తిదాయకంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: