మోడీని ప్రధానిని చేసి, కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పే వ్యూహమేనా ఫెడరల్ ఫ్రంట్!

కేసీఆర్ లో ఆనందం ఉవ్వెత్తున పరవళ్ళు తొక్కుతుంది. తెలంగాణలో తమ పార్టీ టీఆరెస్ అధికారంలోకి రావడంతో ఆయన సంతోషానికి పట్టపగ్గాలు లేవు. తెలంగాణా ప్రజలు మరో సారి మమ్మల్ని నమ్మి అధికారం అప్పగించినందుకు ప్రాణం ఉన్నంత వరకూ ఋణపడి మీకు సేవ చేస్తూ ఉంటాను అంటూ రెట్టింపు సంతోషంతో ఉన్న కేసీఆర్ పర్యటనల మీద పర్యటనలు చేస్తున్నాడు. నూతన ఆశలు అంబరాన్ని చుంబిస్తున్నాయి. రాష్ట్రాన్ని దిగ్విజయంగా ఏలిన కేసీఆర్ గుణాత్మక అభివృద్ధి, విలువలు అంటూ కేంద్రానికి చేరి మోడీని మరోసారి ప్రధానిని చేసి బాబు లాగా కేంద్రంలో  తిప్పాలనేదే  కేసీఆర్ వ్యూహమా!

ఈ క్రమంలోనే కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి కేసీఆర్ పన్నిన వ్యూహాలు అందరికి తెలిసిందే. అయితే ఈ వ్యూహాలు అన్నీ మళ్ళీ నరేంద్ర మోడీ ని ప్రధాన మంత్రిగా కూర్చో పెట్టడానికేనని అంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్  ఆలోచన మోడీని మరోసారి ప్రధానిని చేసే దిశ గానే కొనసాగుతూ ఉంటోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.


ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అనుకున్న కేసీఆర్, మోడీని ప్రధానిగా ఎందుకు చేయాలని అనుకుంటాడు. ఇదెక్కడి లాజిక్ అంటారా?ఇందులోనే బ్రహ్మాండమైన లాజిక్ ఉందని అంటున్నారు. నిన్నటి వరకూ బాబు కేంద్రంలో చక్రం తిప్పితే ఈ సారి చంద్రశేఖరరావు కేంద్రంలో చక్రం తిప్పుతున్నాడు అంటూ టాక్ వినిపిస్తోంది. సరే ఇవన్నీ పక్కన పెడితే అసలు కేసీఆర్ ఫ్రంట్ మోడీని ఎలా ప్రధానిని చేస్తుంది అనే వివరాలలోకి వెళ్తే….

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. బీజేడీ- అధినేత నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి – తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లతో భేటీ అయ్యారు. మీడియా ముందుకు వచ్చి కేసీఆర్ కొన్ని ప్రకటనలు కూడా చేశారు అయితే ఆ సమయంలో కేవలం కేసీఆర్ మాట్లాడారు తప్ప ప్రముఖులైన, ఆయా ప్రాంతీయ పార్టీ నేతలు మాట్లాడకపోవడం గమనార్హం. అయితే వారు ఎందుకు కేసీఆర్ ఫ్రంట్ కి మద్దతు ఇవ్వలేదు అంటే..

కేసీఆర్ చేసే రాజకీయాల గురించి వారికి తమ గూఢచారులు నిఘా వ్యవస్థలు ముందుగానే సమాచారం సేకరించి ఇచ్చారని తెలుస్తుంది. కేసీఆర్ తాను అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వం ఉన్నవాడని,  ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకే తెలంగాణా స్థానమే లేకుండా చేసేశాడనేది జగమెరిగిన సత్యం. కేసీఆర్ ని నమ్మి ముందుకు వెళ్ళడం మంచిది కాదనే అభిప్రాయానికి నవీన్, మమతలు వచ్చారని తెలుస్తుంది.

అంతేకాదు  మోడీకి కేసీఆర్ కి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఇప్పటికీ కొనసాగుతోందని, ఈ విషయంలో నవీన్ పట్నాయక్, మమతలకి అనుమానం ఉంది. 2019 ఎన్నికల్లో ఎన్డీయే వ్యతిరేక ఓట్లను, యాంటీ ఇన్-కంబెన్సీ ద్వారా కొత్తగా పుట్టుకొచ్చిన ఓట్లను  - తన ఫెడరల్ ఫ్రంట్ పేరుతో చీల్చి నరేంద్ర మోదీని మళ్లీ ప్రధాని చేయాలనేదే కేసీఆర్ వ్యూహం కావొచ్చని రాజకీయ పండితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఇక్కడ మరో విషయం ప్రస్తావించాలి చంద్రబాబు నాయుడు విషయంలొ,  మమత అంత విశ్వాసం లేకుండా ఉండటానికి కారణం చంద్రబాబు మోడితో నాలుగేళ్ళు సహవాసం చేసి తన స్వార్ధం కోసం మాత్రమే ఎన్డీయే నుండి బయట పడి – తన రాజకీయ భవితవ్యం కోసం బిజేపి వ్యతిరెఖ కూటమిలో చేరి దాన్ని తానే నడుపుతున్న భ్రమలు కలిపించటం ఆమెకు సుతరాము ఇష్టం లేదంటారు. అంతే కాదు రాజకీయ మిత్రులను పొత్తులను మద్యలో తెగతెంపులు చేసుకోవటం, మిత్రపార్టీలను ముంచటం మొదలైన విషయాల్లో చంద్రబాబు చరిత్ర మొత్తం ఆమెకు బాగా తెలుసు. 

అంతేకాదు కేసీఆర్ ఆ తరవాత అవకాశం వస్తే తెలంగాణా యిచ్చిన  సోనియాను తన్నేసినట్లు నరెంద్ర మోడీని తన్నేసి ప్రధాని పీఠంపై కూర్చోవాలని కూడా కలలు కంటున్నారా!  ఏవరి స్వలాభం కోసం వారు పనిచేసే  ఉభయ ఫ్రంటులు దేశానికి ఏమాత్రం ఉపయోగపడవని విశ్లేషకుల అభిప్రాయం. అనేదానిపై ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. ఈ ఇద్దరు చంద్రుల ఉన్న మరకలు దేశం మొత్తానికి తెలుసు. నందమూరి తారక రామారావును చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే - కేసీఆర్ సోనియా గాంధిని వెన్నుపోటు పొడిచారని - చంద్రులిద్దరూ వెన్నుపోట్లలో ఆరితేరారని - బాగా తేలవటంతో ఎవరైనా మర్యాద పూర్వకంగా వీళ్లను కలుస్తారుగాని వీరిపై ఏమాత్రమూ ఎవ్వరికి విశ్వాసం లేదనేది డిల్లీ దర్బార్ లో వినినిపిచే మాటలు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: