చిరిగిన రూ.200, రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంకు సరికొత్త నిర్ణయం!

siri Madhukar
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పటి వరకు ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు.  ఈ నేపథ్యంలో దేశంలో నల్లధనం నిర్మూలన, దొంగ నోట్లను రూపు మాపడానికి పెద్ద నోట్ల చలామణి రద్దు చేశారు.  రూ.500, రూ.1000 నోట్ల స్థానంలో కొత్త రూ.500 నోటు, రూ.2000 వేల నోటు అమల్లోకి తీసుకు వచ్చారు.  ఆయన నిర్ణయం ఎలా ఉన్న ఐభై రోజులు మాత్రం ప్రజలు నానా అవస్థలు పడ్డారు.  ఒకదశలో కొంత మంది బ్యాంకుల వద్ద పడిగాపులు కాచి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. 

మొత్తానికి కొత్త నోట్ల చలామణితో ప్రస్తుతం కొంత వరకు నల్లధన నిర్మూలన జరిగిందని ప్రభుత్వం అంటుంది.  తాజాగా  భారతీయ రిజర్వు బ్యాంకు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన రూ.200, రూ.2,000 నోట్లకు సంబంధించి రిజర్వు బ్యాంకు తాజాగా కీలక నిర్ణయం ప్రకటించింది. రూ.200, రూ. 2 వేల నోట్లు కనుక చిరిగిపోతే.. చిరిగిన నిడివిని బట్టి వాటి మార్పిడి విలువ ఉంటుందని పేర్కొంది.

కొత్త నిబంధనల ప్రకారం.. రూ. 200 నోటు కనుక చిరిగిపోయి, ఆ నిడివి 39 చదరపు సెంటీమీటర్లు ఉంటే దాని పూర్తి విలువను అంటే..  రూ. 200 ఇస్తారు. అలాగే, రూ. 2 వేల నోట్ల చిరిగిన నిడివి 44 చదరపు సెంటీమీటర్ల లోపు ఉంటే పూర్తి విలువను పొందవచ్చు.  గతంలో కొత్త డీనామినేషన్ నోట్లు చిరిగిన ఘటనలు ఉన్నాయని, చట్టాన్ని వెంటనే సవరించకపోతే ఇదో సమస్యగా మారుతుందని బ్యాంకర్లు అంటున్నారు. చట్టాన్ని సవరించే విషయమై ఆర్ బీఐ కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ కూడా రాసింది. 

అయితే అనుకోని కారణాల వల్ల పెద్ద నోటు చినిగితే..ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని..ఇలాంటి నోటు తీసుకోవడానికి బ్యాంకు సిబ్బంది ఇబ్బందులు పెడుతున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో చిరిగిన కొత్త నోట్లు మార్పిడి చేసేందుకు బ్యాంకులు తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ తాజా నిబంధన ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: