ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్!

Edari Rama Krishna

ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన 24 గంటల్లోపే ప్రభుత్వం కొత్త గవర్నర్‌ను నియమించింది. ఈయన కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ కార్యదర్శిగా పనిచేశారు. అలాగే ప్రస్తుతం ఆర్ధిక సంఘంలో సభ్యునిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్‌‌గా ఉన్న ఉర్జీత్ పటేల్ వ్యక్తిగత కారణాలతో ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.  ఆర్‌బీఐ గవర్నెన్స్‌ పట్ల ఆయనకు సైతం అవగాహన ఉంది. దీనికి తోడు ప్రధాని మోదీతో సత్సంబంధాలు ఉన్నాయి.


ఈ నేపథ్యంలోనే ఆయన్ను ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమించినట్లు తెలుస్తోంది. కాగా కొంత కాలంగా ఉర్జీత్ పటేల్ తలెత్తుతున్న వివాదాలు  పలుమార్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్బీఐ అధికారులు సమావేశమైనా విభేదాలు సద్దుమణగలేదు. వాస్తవానికి గత నెలలోనే ఉర్జీత్ పటేల్ రాజీనామా చేస్తారన్న వార్తలొచ్చాయి. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని గౌరవిస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇవ్వడంతో రాజీనామా విషయంలో ఆయన వెనక్కి తగ్గినట్లు కథనాలు వెలువడ్డాయి. 


61 ఏళ్ల శక్తికాంత దాస్ తమిళనాడు ఐఏఎస్ కేడర్‌కు చెందినవారు. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్‌గా నియమితులవడంతో 15వ ఆర్థిక సంఘంలో తన సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేశారు. మరో రెండు రోజుల్లో ఆయన గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.  రిజర్వు బ్యాంకుకు 25వ గవర్నర్‌గా నియమితులైన శక్తికాంత దాస్ ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: