జగన్ కేసులో కేంద్రానికి 14వ తేదీనే డెడ్ లైన్

Vijaya

జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం కేసులో విచారణపై హై కోర్టు కేంద్రానికే డెల్ డైన్ విధించింది. కేసు విచారణను ఎన్ఐఏతో విచారించే విషయమై వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకుని చెప్పాలంటూ కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. కేంద్రం గనుక నిర్ణయం తీసుకోకపోతే తాము సరైన నిర్ణయం తీసుకుంటామంటూ హెచ్చరించటం గమనార్హం. కోర్టు స్పందించిన తీరు చూస్తుంటే జగన్ హత్యాయత్నం కేసు తొందరలోనే ఎన్ఐఏకి బదిలీ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగా అదే గనుక జరిగితే చంద్రబాబుకు కష్టాలు మొదలైనట్లే అని భావించాలి. మొత్తం మీద జగన్ కేసును కోర్టు చాలా సీరియస్ గా తీసుకున్నట్లే కనిపిస్తోంది.

 

రెండు నెలల క్రితం విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. జరిగిన ఘటనను ఘటనగా చూడకుండా చంద్రబాబునాయుడు బాగా ఎగతాళిగా మాట్లాడారు. అదే ఇఫుడు చంద్రబాబు మెడకు చుట్టుకునేట్లుంది. హత్యాయత్నం ఘటన జరగ్గానే ఓ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా స్పందించి ఉంటే సరిపోయేది. అలా కాకుండా జగన్ పై ఉన్న మంటతోనే దాడి ఘటన అంతా ఉత్త డ్రామా అంటూ చంద్రబాబు కొట్టి పారేశారు. పైగా అప్పటి నుండి చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా జగన్ పై దాడి కేసును కోడికత్తి కోడికత్తి అంటూ ఎగతాళి చేస్తున్నారు. మొత్తం మీద ఏదో తూతూమంత్రంగా సిట్ విచారణ వేసి చేతులు దులుపుకున్నారు.

 

చంద్రబాబు వ్యాఖ్యలు, సిట్ విచారణ తీరు తెన్నులు గమినించిన తర్వాత సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని జగన్ అండ్ కో హై కోర్టును ఆశ్రయించారు. హత్యాయత్నం ఘటనపై థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని కోరారు. ఆ కేసుపైనే కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణలో అడ్వకేట్ జనరల్ వాదనలు పూర్తిగా తేలిపోయాయి. హత్యాయత్నం ఘటన, విచారణ, కేంద్ర్ర ప్రభుత్వ పరిధిలో జరిగిన ఘటనపై రాష్ట్రప్రభుత్వం విచారణ చేయించటం లాంటి అనేక అంశాలపై కోర్టు అడిగిన ప్రశ్నలకు అడ్వకేట్ జనరల్ ఏమీ సమాధానాలివ్వ లేకపోయారు. దాంతో చాలాసార్లే కోర్టు రాష్ట్రప్రభుత్వంపై మండిపడింది. చివరకు కేసును విచారించే విషయంలో ఈనెల 14వ తేదీలోగా ఎన్ఐఏ తో విచారించే విషయమై నిర్ణయం చెప్పాలంటూ కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. ఒకవేళ కేంద్రం గనుక ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతే తామే నిర్ణయం తీసుకుంటామంటూ కోర్టు ఘాటుగా చెప్పటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: