హైదరాబాద్ లో డబ్బులు పంచుతూ దొరికిపోయిన గుంటూరు టీడీపీ నాయకులు..

Chakravarthi Kalyan

తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఉన్న తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్ లో మకాం వేసి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతే కాదు.. మహాకూటమిలో కీలక పాత్ర పోషిస్తూ ఎలక్షన్ మేనేజ్ మెంట్ బాధ్యత తీసుకున్నారు. అయితే టీఆర్ఎస్ ను ఓడించేందుకు చంద్రబాబు ఆంధ్రా నుంచి డబ్బు సంచులు తెస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలకు బలం చేకూరేలా గుంటూరుకు చెందిన టీడీపీ నాయకులు హైదరాబాద్ లో డబ్బు పంచుతూ దొరికిపోయారు.


హైదరాబాద్ లోని సనత్ నగర్ నియోజకవర్గంలో గుంటూరు జిల్లా నుంచి వచ్చిన టీడీపీ నేతలు హోటళ్లలో మకాం వేసి డబ్బులు పంచుతున్నారని టీఆర్ఎస్ నేతలకు సమాచారం వచ్చింది. వారు పోలీసులకు సమచారం అందించారు. అదే సమయంలో హోటల్ బయట ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వీరారెడ్డి, సాంబశివ, కొలిశెట్టి శ్రీనివాస్ అమీర్‌పేట్‌లోని సిల్వర్ పార్క్ హోటల్లో వేర్వేరు గదుల్లో ఉన్నారు.


వారి గదుల్లో తనిఖీ చేయగా.. మొత్తం నాలుగు లక్షల రూపాయలకుపైగా నగదు దొరికింది. దీంతో ఆగ్రహం చెందిన టీఆర్ఎస్ నేతలు దాడికి దిగారు. దీంతో అర్థరాత్రి ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ గొడవలో అడ్డుకునేందుకు యత్నించిన ఎస్సైపై కూడా టీఆర్ఎస్ నేతలు దాడికి ప్రయత్నించారు. దీంతో గోషామహల్ ఏసీపీ నరేందర్ రెడ్డి అక్కడకు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

ఈ పరిణామంపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు కృష్ణా , గుంటూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులను డబ్బు సంచులతో హైదరాబాద్ పంపి ఓట్ల కొనుగోలుకు తెర లేపారని ఆరోపిస్తున్నారు. దొడ్డిదారిన తెలంగాణలో పాగా వేసేందుకు చంద్రబాబు కుట్రపన్నుతున్నారని మండిపడుతున్నారు. ఈసీ తగిన చర్యలు తీసుకుని ఇలాంటి చర్యలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: