చిరు తల్లి ఆశీర్వాదం.. అంతలోనే అవార్డ్.. మొగలిరేకులు సాగర్ మూవీ ఖాతాలో రేర్ రికార్డ్!
ఈ సినిమాకు దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డులలో హానరబుల్ జ్యూరీ అవార్డ్ రావడం గమనార్హం. నెటిజన్లతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సాగర్ కు, ది 100 మూవీ టీంకు అభినందనలు తెలుపుతున్నారు. రిలీజ్ కు ముందే అవార్డులను సొంతం చేసుకుంటున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇంకెన్ని అవార్డులను అందుకుంటుందో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఓంకార్ శశిధర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా సాగర్ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ అందుకుంటారని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కడం గమనార్హం. నగర శివార్లలోజరిగిన కొన్ని సీరియల్ మర్డర్స్ను ఇన్వెస్టిగేట్ చేసే అధికారి పాత్రలో ఈ సినిమాలో సాగర్ కనిపించనున్నారు. సినిమాలో విక్రాంత్ అనే పాత్రను సాగర్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది.
బుల్లితెరపై స్టార్ స్టేటస్ అందుకున్న సాగర్ వెండితెరపై కూడా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. సాగర్ టాలెంట్ కు తగిన సక్సెస్ దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. షాదీ ముబారక్ తర్వాత సాగర్ నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. బీవీఎస్ రవి బ్యానర్ లో సాగర్ హీరోగా ఒక సినిమా ఫిక్స్ అయిందని త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని భోగట్టా.