మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అని బాబుకి తేల్చి చెప్పేసిన రాహుల్..!

KSK
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు వ్యవహరిస్తున్న రాజకీయ కోణం పై అనేక చర్చలు జరుగుతున్నాయి. తమ స్వార్ధ రాజకీయాలకోసం 2014 ఎన్నికలలో ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ..ఆంధ్రలో ప్రజల మనోభావాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా  ఇష్టానుసారంగా వ్యవహరించారు.

అయితే ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో బీజేపీతో చేతులు కలిపి దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని ఆంధ్ర ప్రజలకు పిలుపునిచ్చిన చంద్రబాబు తాజాగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడంతో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు.

ఇదే క్రమంలో చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. తెలంగాణలో క్లియర్ గా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు..ఏపీలో కూడా అదే దిశలో పొత్తు ఉంటున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయమై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో ఇలా అన్నారట...‘రాష్ట్రంలో ఎలా వ్యవహరించాలన్నది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. మన రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని పోటీచేస్తే మీకు లాభమనుకుంటే అలాగే వెళ్దాం. ఎవరికి వారు విడిగా పోటీ చేయడం మంచిదనుకుంటే అదే చేద్దాం’ అని రాహుల్ చంద్రబాబుతో చెప్పినట్లు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: