రాజస్థాన్ లో రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వానేనా!

Edari Rama Krishna
దేశంలో గత కొన్నిరోజుల నుంచి ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.  తెలుగు రాష్ట్రాలతో పాటుగా రాజస్థాన్, మిజోరాం,మద్యప్రదేశ్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే రెండు విడుతలుగా ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరిగాయి.  ఛత్తీస్‌గఢ్‌లో తుది విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 71.93 శాతం ఓటింగ్ నమోదయింది.   కాగా, నవంబరు 12న తొలిదశలో 18 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 76.28 శాతం పోలింగ్ నమోదయింది. డిసెంబరు 11న ఎన్నికల ఫలితాల వెల్లడవుతాయి.

ఆ మద్య రాజస్థాన్ లో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘొర పరాభవం ఎదుర్కొంది.  దాంతో వసుందర రాజే ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడైనా అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయి..కానీ ఇక్కడ అలా జరగకపోవడం ప్రభుత్వం వైఫల్యమే కారణం అని అంటున్నారు. మరి కొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్ లో అధికార బీజేపీకి ఎదురు దెబ్బ తగలడంతో అంతర్మధనంలో పడిపోయారు.  భవిష్యత్ లో ఇలాగే ఉంటే సాధారణ ఎన్నికల్లో సైతం ఓటమి తప్పదన్న భయం కమలనాధులకు పట్టుకుంది. 

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగైనా తమ పట్టు నిలుపుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు అధికార బీజేపీ ఎక్కడ లోపాలు ఉన్నాయో సరిచూసుకునే ప్రయత్నంలో ఉంది.  2014 లో కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా గెల్చుకోలేని పరిస్థితి..కానీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపడం..స్థానిక నాయకులకు సమిష్టిగా కలిసి పని చేయాలని ముందు నుంచి రాహూల్ హితబోద చేయడం పార్టీ పెద్దల నుంచి కార్యకర్తల వరకు చురుకుగా పనిచేయడం అన్ని కలిసి వచ్చాయి. 

ఇదే సమయంలో ప్రభుత్వం వ్యతిరకేకత కొట్టొచ్చినట్లు కనిపించడంతో బీజేపీ ఓటమికి కారణాలు అయి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  ఏది ఏమైనా రాజస్థాన్ లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అనే విధంగా తలపడబోతున్నట్లు స్పష్టమవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: