ఉపఎన్నికల్లో పోటికీ సిద్దం : కమల్ హాసన్

Edari Rama Krishna
తమిళ నాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత రాజకీయ పరిణామాలు ఎన్నో రకాలుగా మార్పులు చేర్పులు వచ్చాయి.  మిత్రులు శత్రువులయ్యారు..శత్రువులు మిత్రులయ్యారు.  జయలలిత మరణం తర్వాత సీఎం పీఠం ఎక్కాలని చూసి శశికళ ఎత్తులు చిత్తులయ్యాయి..ఆమె ముఖ్యమంత్రిగా నిలబెట్టిన పళని స్వామి ఆమెకే చెక్ పెట్టారు.  శత్రువులు అనుకున్న పన్నీరు సెల్వం మిత్రులయ్యారు.  ఇలా ఎన్నో రకాల రాజకీయ పరిణాల మద్య తమిళ స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్ లు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 

ఇక కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యమ్’పార్టీ స్థాపించారు. ఈ నేపథ్యంలో  తమిళనాడులో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలతోపాటు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నట్టు నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ తెలిపారు. ఇదిలా ఉంటే..జయలలిత మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఆ సమయంలో టీటీవీ దినకరన్‌కు మద్దతు పలుకుతూ అటువైపు వెళ్లిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీనిని మద్రాస్ హైకోర్టు కూడా సమర్థించడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.

మరోవైపు  కరుణానిధి, అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఏకే బోస్ మృతితో మరో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో మొత్తం 20 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. దాంతో తమిళనాడులో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలతోపాటు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నట్టు నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: