పవన్ కళ్యాణ్ పిలుపుకు స్పందించిన రామ్ చరణ్..!

KSK
తాజాగా ఇటీవల ఉత్తరాంధ్ర ప్రాంతం శ్రీకాకుళం జిల్లా ను వణికించిన తిత్లి తుఫాను వరద బాధిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా అక్కడ ఉన్న వరద బాధితులకు అండగా ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ సమస్యలను లేవనెత్తుతూ ప్రభుత్వ దృష్టికి తీసుకు వస్తున్నారు.


కేరళ రాష్ట్రంలో ఇటీవల వనికించిన వరద ప్రాంతాలలో శ్రీకాకుళం జిల్లాను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలని కామెంట్ లో కూడా చేశారు పవన్. ఈ నేపథ్యంలో తనకు తెలిసిన ప్రముఖులను శ్రీకాకుళం జిల్లాలో తుఫానుకు పాడైపోయిన గ్రామాలను దత్తత తీసుకోవాలని సూచిస్తానని వరద ప్రాంతాలలో ఉన్న ప్రజలకు తెలియజేశారు పవన్.


ముఖ్యంగా తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కుమారుడైన రామ్ చరణ్ ని ఒక గ్రామాన్ని దత్తత తీసుకోమని చెబుతానని అన్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్”బాబాయ్ నన్ను అక్కడ దెబ్బ తిన్న గ్రామాలలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోమని సూచించడం చాలా ఆనందానికి గురి చేసిందని,కళ్యాణ్ బాబాయ్ యొక్క సూచనల మేరకు


తాను తన టీం తో చర్చించి అక్కడ దెబ్బ తిన్న గ్రామాలను పరిశీలించి అతి త్వరలోనే దత్తత తీసుకుంటానని” ఒక ప్రెస్ మీట్ నోట్ ని విడుదల చేశారు.ఈ విషయం తెలుసుకున్న మెగాభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోసారి అబ్బాయ్ తన బాబాయ్ మీదున్న ప్రేమను వ్యక్త పరిచాడు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: