ఆ ఎన్నికలు ఏపీని మార్చేస్తాయా...!!

Satya
ఇప్పటికిపుడు ఏపీలో ఎన్నికలు జరిగితే ఎవరికి లాభమన్న  అంచనాలు ఎన్నో వస్తున్నాయి, కానీ ఇవేమీ పెద్దగా పట్టించుకోవడంలేదు మన నేతాశ్రీలు. రేపటి ఏపీ ఎన్నికలలు ఊపూ, వూతం ఇచ్చే అసలైన  ఎన్నికలు జరుగుతున్నాయక్కడ. ఆ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను  ఎంతవరకు ఎలా ప్రభావితం చేస్తాయో తెలియదు కానీ ఏపీని ఓ కుదుపు కుదపడం ఖాయంగా కనిపిస్తోంది.


కేసీయార్ గెలిస్తే :


తెలంగాణాలో జరిగే ముందస్తు ఎన్నికలను ఏపీ రాజకీయ పార్టీలు చాలా సీరియస్ గా పరిశీలిస్తున్నాయి. అక్కద టీయారెస్ గెలుస్తుందా, మహా కూటమి నెగ్గుతుందా అన్న దానిపై ఏపీలోనూ బెట్టింగులు సాగుతున్నాయి.  అంతకంటే ముందు ఏపీలో పొలిటికల్ పార్టీలు  ఈగర్ గా వైట్ చేస్తున్నాయి. అక్కడ ఫలితాలను  బట్టే ఇక్కడ వ్యూహాలు ఉంటాయట. కేసీయార్ గెలవాల‌ని కొన్ని పార్టీలు అనుకుంటూంటే కూటమి నెగ్గాలని మరికొన్ని అనుకుంటున్నాయి. కేసీయార్ కనుక గెలిస్తే ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతాయి.


ఇక్కడా కూటమి :


ఆక్కడ కేసీయార్ గెలిచిన మరుక్షణం ఏపీలో బాబుకి వ్యతిరేకంగా కూటమి కట్టేందుకు రెడీ ఐపోతారని అంటున్నారు. హాపీగా తాపీగా జరుగుతున్న తెలంగాణా ఎన్నికలను మహా  కూటమి కట్టి బాబు పెద్ద తలకాయ నొప్పి కేసీయర్కి తెప్పించిన సంగతి విధితమే. మరి దానికి తగిన ప్రతీకారం తీర్చుకోకుండా కేసీయార్ ఉంటారా. అందువల్లనే ఆయన గెలిచిన తరువాత మూడవ కన్ను తెరచేది బాబు పైనేనని అంటున్నారు. 


ఆ ఇద్దరూ ఒకటి :


ఇక ఏపీలో వైసీపీ, జనసేన పార్టీలు విడివిడిగా రాజకీయం చేస్తున్నాయి. కేసీయార్ గెలిస్తే ఈ ఇద్దరిని కూర్చోబెట్టి మరీ ఒకటి చేస్తారని అంటున్నారు. ఆయన కనుసన్నలలోనే రేపటి ఏపీ రాజకీయం సాగుతుందనీ చెబుతున్నారు. తన ఎత్తులు జిత్తులు ఏపీ నాయకులుకు కూడా చెప్పి  బాబుని గద్దె దించేందుకు కేసీయార్ సర్వ శక్తులు ఒడ్డుతారని అంటున్నారు. ఇప్పటికే జనసేనాని కవాతును కేసీయార్ తనయుడు కేటీయార్ పొగిడిన సంగతి విధితమే. అలాగే జగన్ తోనూ మంచి రిలేషన్లు ఉన్నాయి.


కాంగ్రెస్ తో బాబు :


ఇక కూటమి పేరిట‌ జగన్, పవన్ ముందుకు వస్తే బాబు చూస్తూ ఊరుకోరని, కాంగ్రెస్ తో జత కట్టి వారికి సరైన జవాబు చెబుతారని అంటున్నారు. రేపటి ఎన్నికల్లో బాబు అలా గెలిచేందుకు ప్లాన్ తో తయారుగా ఉంటారనీ చెబుతున్నారు. మరి ఈ పొత్తులు. ఎత్తులు కార్య రూపం దాల్చాలంటే డిసెంబర్ వరకూ ఆగాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: