చంద్ర బాబు ప్రచారం బుద్ది.. చివరికి ప్రజల ఆగ్రహానికి గురైనాడు...!

Prathap Kaluva

శ్రీకాకుళం లో ఒక పక్క తుఫాన్ వచ్చి అల్లాడుతుంటే ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు సరిగ్గా చేపట్టకుండా ప్రచారాల ఆర్బాటనికి తెర లేపింది. దీనితో ప్రజలు కన్నెర్ర చేశారు.  గత కొన్నిరోజులుగా చంద్రబాబు స్వయంగా సహాయక చర్యలు చేపడుతుండగా అక్కడి ప్రజల నుండి ఆయనకు కొంత వ్యతిరేకత ఎదురైంది. దాంతో ఒకటి రెండు సందర్భాల్లో ఆయన, లోకేష్ ఇద్దరూ ప్రజలపై అక్కడికక్కడే గొంతు పెద్దది చేసి కోపగించుకున్నారు. అంతేకాదు పూర్తి సహాయం చేస్తున్నట్టు పెద్ద పెద్ద హోర్డింగులు కూడ నెలకొల్పారు తెలుగుదేశం కార్యకర్తలు.


ఆ వీడియోలను, ఫోటోలను సామజిక మాధ్యమాల్లో ఉంచిన వైకాపా, జనసేన శ్రేణులు తీవ్రంగా విమర్శలు గుప్పించాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న బాబు తమ కార్యక్రమాలను కొందరు ప్రసార సాధనాల్లో తప్పుగా చిత్రీకరిస్తున్నారని, అది తగదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక తాజాగా పర్యటన మొదలుపెట్టి ప్రజల బాధల్ని పుస్తకంలో నోట్ చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ ఫోటోలను తెలుగు తమ్ముళ్లు, వైకాపా మద్దతుదారులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎందుకిదంతా, ఏం ఉపయోగం ఈ పర్యటన వలన, మొన్నటి వరకు కవాతు చేసుకుంటూ బాధితుల్ని నిర్లక్ష్యం చేసి ఇప్పుడెందుకు పర్యటన అంటూ ఎద్దేవా చేయసాగారు.


దానికి సమాధానంగా పవన్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు ఆటంకం కలుగకూడదని పర్యటన ఆలస్యం చేశాను. అంతేకానీ కవాతు కోసం కాదు. టీడీపీ శ్రేణులు మా పర్యటనను విమర్శించడం మానుకోవాలి. మీ గెలుపులో మా పాత్ర కూడ ఉందని మర్చిపోకండి అంటూ చురకలంటిచారు. ఇలా ఇద్దరు పార్టీ అధ్యక్షులు సోషల్ మీడియాలో ఒకరికొకరు వార్నింగ్స్ ఇచ్చుకోవడం, తమను తాము సమర్థించుకోవడం అచ్చంగా సినిమా ఎపిసోడ్ ను తలపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: