ఐఖ్య రాజ్య సమితి లో భారత్ కు ఘనవిజయం

ఐక్యరాజ్యసమితిలో భారత్‌ కు గౌరవం ఘనవిజయం దక్కింది. "మానవ హక్కుల మండలి" విభాగానికి జరిగిన ఎన్నికల్లో భారత్ ఘనవిజయం నమోదు చేసుకుంది. "యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్" కోసం జరిగిన ఎన్నికల్లో భారత్ అత్యధిక ఓట్లతో నెగ్గింది. యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యత్వం కోసం జరిగిన పోల్‌ లో భారత్ 188ఓట్లు సాధించింది. ఆసియా పసిఫిక్ క్యాటగిరీలో భారత్‌ కు ఈ గౌరవం దక్కడం విశేషం.



"మానవ హక్కుల మండలి" లో భారత్ మూడేళ్ల సభ్యత్వం దక్కించుకున్నది. 2019, జనవరి ఒకటవ తేదీ నుంచి ఈ సభ్యత్వం అమలు లోకి వస్తుంది. "యూఎన్ జనరల్ అసెంబ్లీ"లో మొత్తం 193సభ్య దేశాలు ఉన్నాయి. మానవ హక్కుల మండలిలో 18మంది కొత్త సభ్యుల కోసం ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే ఒక్కొక్క దేశానికి కనీసం 97ఓట్లు వస్తేనే సభ్యత్వం లభిస్తుంది. "ఆసియా పసిఫిక్ క్యాటిరీ" లో బెహ్రాయిన్, బంగ్లాదేశ్, ఫిజీ, పిలిప్పీన్స్‌ తో పోటీపడ్డ భారత్‌కు గెలుపు సులువైంది.


భారత్ ఘనవిజయం అంతర్జాతీయంగా మన దేశ గౌరవ ప్రమాణాన్ని సూచిస్తుందని "యూఎన్ అంబాసిడర్-సయ్యిద్ అక్బరుద్దీన్" తెలిపారు. మద్దతు తెలిపిన స్నేహితుల కు ధన్యవాదాలు తెలుపుతూ యూఎస్ అంబాసిడర్ ట్వీట్ చేశారు.


United Nations

✔@UN 

#UNGA has elected 18 countries to Human Rights Council: Burkina Faso, Cameroon, Eritrea, Togo, Somalia, Bahrain, Bangladesh, Fiji, India, Philippines, Bulgaria, Czech Republic, Argentina, Bahamas, Uruguay, Austria, Denmark, Italy: https://bit.ly/2sWf2fl  #StandUp4HumanRights

10:31 PM - Oct 12, 2018

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: