సీఎం రమేశ్ సంస్థలపై ఐటి దాడులతో, ఇక కేంద్రం మెడలు వంచటానికే నారా లోకేష్ మొగ్గు!

టీడీపీ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేశ్ ఇంటిపై జరిగిన ఐటీ దాడులపై ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్ నిప్పులు చెరుగుతూ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ విభజనచట్టంలో పేర్కొన్న హామీలపై గట్టిగా నిలదీసినందుకే ప్రధాని ఆంధ్రప్రదేశ్‌పై కక్ష గట్టారని లోకేశ్ ఆరోపించారు. కడప ఉక్కు  ఆంధ్రుల హక్కు అన్నందుకే సీఎం రమేశ్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిపించారని అన్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం దీక్ష చేసి 100రోజులు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడానికే రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకే ఐటీ దాడులు చేయిస్తున్నారని నారా లోకేశ్ కేంద్రాన్ని ఎద్దేవా చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాము ప్రత్యేక హోదా సాధనలో వెనకడుగు వేసే ప్రశక్తి లేదని, కేంద్రం మెడలు వంచైనా హోదా సాధిస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.

ఇవాళ ఉదయం హైదరాబాద్, కడపలలోని ఎంపీ సీఎం రమేశ్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఎంపీ ఢిల్లీలో ఉన్నారు. మొన్న బీద మస్తాన్‌రావు, నిన్న సుజనాచౌదరి, నేడు సీఎం రమేశ్‌పై ఐటీ దాడులు చేయడం దీనిలో భాగమేనన్నారు. కడప ఉక్కు - ఆంధ్రుల హక్కు అన్నందుకే రమేశ్‌ను లక్ష్యం చేసుకున్నారని నారాలోకేశ్‌ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు రాకుండా చేయాలని దురుద్దేశం తోనే రాష్ట్రంలోని పారిశ్రామిక  వేత్తలు, పరిశ్రమలపై ప్రధాని మోదీ దాడులు చేయిస్తున్నారని నారా లోకేశ్‌ దుయ్యబట్టారు. 


ఆపరేషన్‌ గరుడ లో భాగంగానే తెదేపా నేతలపై ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రి నారా లోకేశ్‌ ఆరోపించారు. ప్రత్యేక హోదాతో పాటు ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని మరోసారి నిలదీశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: