నారా లోకేష్, చంద్రబాబు, చింతమనేనికి అదిరిపోయే డోస్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

KSK
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్ర చివరిదశకు వచ్చిన నేపథ్యంలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జిల్లా నేతల పై మండిపడ్డారు. ఈ క్రమంలో కొయ్యలగూడెం లో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై నారా లోకేష్ పై మరియు అదే విధంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై సంచలన కామెంట్లు చేశారు.


ప్రజాస్వామ్యంలో హుందాగా వ్యవహరించాల్సిన ప్రజా ప్రతినిధులు ప్రజలను కులం పెట్టి దూషిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు అటువంటి వ్యక్తులకు విప్  పదవులు ఇచ్చి చట్టాలను అతిక్రమస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇటువంటి విషయాలలో ఉన్నారండి తప్పుబట్టారు. తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు చింతమనేని ప్రభాకర్ ని విప్ పదవి నుంచి తొలగించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.


ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను ఏది మాట్లాడినా మంత్రి జవహర్ తప్పుపడుతున్నారని, ఎస్సీ సామాజిక వర్గాలను అవమానిస్తూ, వారిని కొడుతుంటే ఆయనకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే, 14 వేల కిలోమీటర్ల రోడ్లు వేశామని మంత్రి లోకేష్ చెబుతున్నారన్నారు.


మంత్రి లోకేష్ చెప్పే మాటలు.. చేతల్లో కనిపించడం లేదన్నారు. ముఖ్యమంత్రి, అయన కుమారుడు లోకేష్ విమానాలు దిగి గ్రామాల్లో తిరిగితే రోడ్ల పరిస్థితి తెలుస్తుందన్నారు. ఇటువంటి మనస్తత్వం కలిగిన రాజకీయ నాయకులను రాబోయే ఎన్నికలలో ప్రజాక్షేత్రంలో లేకుండా ప్రజలందరూ సరైన విధంగా బుద్ధి చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: