పవన్ ఎట్టకేలకు అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు ...!

Prathap Kaluva

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్నటివరకు 2019 ఎన్నికల్లో నేనే ముఖమంత్రి ని చెబుతుంటే చాలా మందికి నవ్వొచ్చింది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అసలు నిజం తెలుసుకునట్టున్నాడు. అవును.. తను ముఖ్యమంత్రిని కాకపోయినా ముఖ్యమంత్రి ఎవరో తేల్చే నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతానంటున్నారు జనసేన అధ్యక్షుడు. తనకు ఎన్ని సీట్లు వస్తాయో చూచాయగా కూడా చెప్పలేకపోతున్న పవన్.. ఎవరికైనా జనసేన మద్దతు మాత్రం అవసరం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.  


"లగడపాటి రాజగోపాల్ నాకు రెండేళ్ల కిందట స్వయంగా ఓ మాట చెప్పారు. మీరు ప్రభుత్వాన్ని స్థాపిస్తారో లేదో నేను చెప్పలేను కానీ, మీకు వచ్చిన సీట్లతో మీరు కీలకంగా మారతారు. మీరు సపోర్ట్ చేయకపోతే వైసీపీ, టీడీపీలో ఏదీ రాదు అని లగడపాటి నాతో చెప్పారు. కావాలంటే వెళ్లి ఆయన్ను అడగండి. ఈరోజు ఆ రెండు పార్టీలకు నేను సమదూరంలో ఉన్నాను. వాళ్లకు బాధ్యతలు గుర్తుచేస్తున్నాను. వాళ్లతో పోరాడుతున్నాను. ఎవరికైనా నా సపోర్ట్ కావాల్సిందే."


ఇది పవన్ కల్యాణ్ తాజా స్టేట్ మెంట్. జనసేనకు 4 లేదా 5 సీట్లు వస్తాయని ప్రతి ఒక్కరు అంటున్నారనే విషయాన్ని ప్రస్తావించిన పవన్... ఎన్ని సీట్లు వచ్చినా నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేది మాత్రం తానేనని నమ్మకంగా చెబుతున్నారు. ఈ కింగ్ మేకర్ అనే డైలాగులు, నిర్ణయాత్మక శక్తి అనే పదాల్ని పక్కనపెడితే.. జనసేనానికి ఒక విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చిందనే విషయం ఇక్కడ స్పష్టమౌతోంది. తను అధికారంలోకి రావడం కష్టమనే విషయాన్ని కాస్త ఆలస్యంగానైనా గ్రహించారు పవన్.  మొన్నటివరకు ప్రజల ఆశీస్సులుంటే ముఖ్యమంత్రిని అయిపోతానంటూ ప్రతి మీటింగ్ లో ఊదరగొట్టిన జనసేనాని, ఈసారి మాత్రం పాతికేళ్ల రాజకీయ ప్రణాళికతో వచ్చానని మాత్రమే చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: