అసెంబ్లీ సీట్లు పెరిగితే ఆ పార్టీకి షాకేనా !!

Satya
అపుడెపుడో అక్కడ బీజేపీ, ఇక్కడ టీడీపీ కొలువు తీరిన కొత్తల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అన్న వార్తలు రోజూ పత్రికల్లో పెద్ద అక్షరాలతో అచ్చయ్యేవి. నాలుగేళ్ళ పాటు అసెంబ్లీ సీట్ల పెంపు కోసం అంతా ఎదురు చూశారు. కానీ ఆ ఫైల్ పడుతూ లేస్తూ పడకేసేసింది. ఇపుడు హఠాత్తుగా సీట్లు పెంపు అంటూ డిల్లీ నుంచి న్యూస్ వస్తోంది. ఇది ఎంతవరకు నిజం, దీని వల్ల ఎవరికి లాభం


ఇపుడే ఎందుకు :


ఉపరాష్త్రపతి కాకముందు వెంకయ్యనాయుడు అసెంబ్లీ సీట్ల పెంపు పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేశారు. ఇక టీడీపీ గురించి చెప్పనక్కరలేదు. ఆ పార్టీ సీట్ల పెంపును దాదాపు ప్రతీ రోజూ కోరుతూ వచ్చింది. ఈ ఒక్క విషయంలోనే టీయారెస్ తో కలసి మరీ డిల్లీ పై వత్తిడి తెచ్చింది. నిజానికి బాబు బీజేపీకి బై చెప్పడానికి అతి ముఖ్య కారణం సీట్లు పెంచలేదనే. అలాటిది ఇపుడే ఈ ప్రకటనలు ఎందుకు వస్తున్నాయి. నిజంగా సీట్లు పెరుగుతాయా


నెక్స్ట్ సెషన్లోనట:


అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి బిల్లు రెడీ అయిందని వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు బిల్లు వస్తుందని హస్తిన వర్గాలు అంటున్నాయి. ఓ వైపు చూస్తే తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు రంగం సిధ్ధం అవుతుతోంది. మరో వైపు ఏపీ లో టీడీపీ జారిపోయింది. ఈ టైంలో సీట్ల పెంపు అంటే  నమ్మాలా అన్న సందేహలూ వస్తున్నాయి. ఈ మధ్యనే హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ దీనిపై మాట్లాడుతూ సీట్ల పెంపు కుదరరదని, రాజ్యంగా సవరణ చేయాలని కూడా చెప్పుకొచ్చారు. మరి ఇంతలోనే ఇలా అంటున్నారంటే ఏదో  మతలబు ఉందేమో. మళ్ళీ టీడీపీని మచ్ఛిక చేసుకునే వ్యూహమేమో.


ఎవరికి లాభం :


తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల పెంపు అంటూ జరిగితే అది ఏపీకే పరిమితం అవుతుందా. తెలంగాణాను కలుపుతారా అన్నది సందేహం. అలా కలిపితే అక్కడ ఎన్నికలు ఆగిపోతాయి. మరి అలా  జరుగుతుందా అన్నది చూడాలి. ఇక అసెంబ్లీ సీట్లు ఏపీలో పెంచేందుకు చాన్స్ ఉంది. ఎన్నికలకు ఏడు నెలల వ్యవధి పైగా ఉంది. దాంతో ఏపీలో ఘాటుగా చర్చ సాగుతోంది. సీట్లు పెరిగితే మాత్రం అది కచ్చితంగా టీడీపీకే లాభమని చెప్పుకోవాలి. ఇపుడున్న 175 నుంచి 225 సీట్లు చేస్తే అదనంగా యాభై సీట్లు వస్తాయి. టీడీపీలో పెద్ద ఎత్తున ఆశావహులు, ఫిరాయింపుదారులు ఉన్నారు.


 వారందరికీ చోటు కల్పించడం ద్వారా పార్టీని ముందుకు తీసుకుపోవచ్చు. నియోజక వర్గాలను పవర్లో ఉన్న పార్టీ తనకు వీలుగా విభజించుకునేందుకు  అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు ఎక్కువమంది కొత్తవారిని దింపడం ద్వారా టీడీపీ ఫ్రెష్ లుక్ తో జనంలోకి వస్తుంది. సో పెరిగితే మాత్రం టీడీపీకే ప్లస్ అవుతుందని చెప్పాలి.అదే టైంలో వైసీపీకి కూడా సీట్ల పెంపు యూజ్ అయినా అధికార టీడీపీకి ఉన్న అడ్వాంటేజెస్ ఉండవ్, 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: