శబరిమలలో మహిళల ప్రవేశం - దైవం ముందు స్త్రీ పురుషులు సమానులే - సుప్రీం సంచలనం

కేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమలలో మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు శుక్రవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 4:1 నిష్పత్తి తో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. పురుషులతో పోలిస్తే  మహిళలు ఎందులోనూ తక్కువ కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.  చట్టాలు, సమాజం అందరిని సమానంగా గౌరవించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు మహిళల ప్రవేశానికి సాను కూలంగా స్పందించారు. దీనికి సంబంధించి ఒక న్యాయమూర్తి మాత్రం మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించారు.



ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో 4:1 నిష్పత్తి భేదంతో  ఈ తీర్పును సుప్రీంకోర్టు నేడు (శుక్రవారం) వెలువరించింది.శబరిమల ఆలయంలోకి  మహిళలను ప్రవేశించ కూడదని ఇప్పటివరకు ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం నాడు ఎత్తివేస్తూ తీర్పు ఇచ్చింది. మహిళలపై విపక్ష చూపడం సరైంది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది.ఆలయాల్లో లింగ వివక్షకు తావు లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎందులో కూడ తక్కువ కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. మహిళలను ఆలయాల్లోకి రాకుండా నిషేధించడమనేది హిందూమత స్వేచ్ఛకు భంగమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

చట్టం, సమాజాన్ని రెంటిని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశంలో మహిళలను దేవతలుగా గౌరవిస్తున్నామని  వారి రూపాన్నే శక్తిగా పూజిస్తున్నామని, మరో వైపు లింగ వివక్షతతో ఆంక్షలు విధిస్తున్నామని తెలిపారు. ఒక వైపు దేవతలుగా పూజిస్తూనే మరోవైపు వారిని సమదృష్టితో చూడకపోవడం సరైంది కాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.



మత మనేది ప్రాథమిక జీవన విధానంలో ఒక భాగంగా ఉండాలని, వారి బయోలాజికల్‌ లక్షణాలను ఆధారంగా చేసుకొని రాజ్యాంగ చట్టాల్లో మార్పు ఉంచడం సబబు కాదని తమ తీర్పు వెల్లడించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.  "యంగ్ ఇండియా లాయర్స్ అసోసియేషన్" ప్రతినిధులు శబరిమలలో మహిళలకు ప్రవేశాన్ని కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు  చేశారు. ఈ పిటిషన్ పై  ఇరువర్గాలు తమ తమ వాదనలను విన్పించారు.

2018 ఆగష్టు 1 నాటికి  ఈ విషయమై  ఇరువర్గాల వాదనలు ముగిశాయి. అయితే  ఈ విషయమై కోర్టు మాత్రం తీర్పును రిజర్వ్ చేసింది. న్రేడు (శుక్రవారం) సుప్రీం కోర్టు శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పు సంచలన తీర్పును వెలువరించింది.


*ఇక నుండి అన్ని వయసుల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించొచ్చని స్పష్టంచేస్తూ
*పది నుంచి యాభై ఏళ్ల వయసు మహిళలపై ఉన్న నిషేధాన్ని కోర్టు ఎత్తేసింది.

ఆలయంలోకి మహిళ ప్రవేశాన్ని అడ్డుకుంటున్న ఆలయ నిబంధనలు రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 14, 25ను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. శబరిమల ఆలయంలోకి ప్రవేశానికి మహిళల వయసుకు సంబంధించి నిబంధనలు విధించడాన్ని అత్యవసర మతపరమైన విధానంగా పరిగణించలేమని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు ఈ తీర్పుతో ఏకీభవించగా ఒకే ఒక మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా విభేదిస్తూ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సతీ సహగమనం లాంటి సామాజిక రుగ్మతలు మినహా,  మతపరమైన విధానాలను తొలగించే నిర్ణయం కోర్టు పరిధిలోకి రాదని ఆమె పేర్కొన్నారు.  దేశంలో లౌకిక వాతావరణాన్ని కల్పించేందుకు బలంగా నాటుకు పోయి ఉన్న మత పరమైన ఆచారాల్లో మార్పు చేయొద్దని అభిప్రాయపడ్డారు. ఋతుక్రమం వయసు లోని (10 నుంచి 50ఏళ్లు) మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించొద్దని ఎన్నో ఏళ్లుగా నిబంధన ఉన్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: