మోడీ పొలిటికల్ ప్రయాణం లో ఎవరు ఊహించని సంచలన విషయాలు..!

KSK
దేశ ప్రధాని భారతీయ జనతా పార్టీ నాయకుడు అయిన శ్రీ ప్రధాని మోడీ... జీవితంలో అనేక ఒడుదుడుకులను ఎదుర్కొనడం జరిగింది. ఎన్ని కష్టాలు వచ్చినా పోరాటాలు వచ్చినా వాటిని వివేకం గా... తెలివిగా... ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగడం జరిగింది. టీ అమ్ముకునే స్థాయి నుండి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ ప్రధాని పీఠం పై కూర్చునే స్థాయి దాకా వెళ్లారంటే దానికి గల ప్రధాన కారణం భారత జాతి పట్ల ఆయనకున్న ప్రేమ అభిమానం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మోడీ రాజకీయ ప్రయాణాన్ని ఒకసారి గమనిస్తే...1987లో భారతీయ జనతా పార్టీలో చేరడం ద్వారా మోడీ ప్రధాన రాజకీయాల్లోకి ప్రవేశించారు.


కేవలం ఒక్క సంవత్సర కాల వ్యవధిలోనే గుజరాత్ యూనిట్‌ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ సమయానికే శ్రీ నరేంద్ర మోడీ అత్యంత సమర్థవంతమైన నిర్వాహకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. పార్టీ కార్యకర్తలను బలోపేతం చేసే సవాలును స్వీకరించారు. భారతీయ జనతా పార్టీ రాజకీయంగా పెద్ద శక్తిగా ఎదిగి ఏప్రిల్ 1990లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ భాగస్వామ్యం కొన్ని నెలలకే పరిమితమైనప్పటికీ.. భారతీయ జనతా పార్టీ 1995 లో గుజరాత్ లో సొంతంగా ఒక రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.


దీంతో గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ పాలన ప్రారంభమైంది. 1988, 1995 మధ్య గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవడంలో శ్రీ నరేంద్ర మోడీ చేసిన క్షేత్రస్థాయిలో చేసిన కృషి పనిచేసింది. దాంతో శ్రీ నరేంద్ర మోడీని ప్రతిభావంతమైన వ్యూహాకర్తగా పార్టీ గుర్తించింది. ఈ కాలంలో శ్రీ నరేంద్ర మోడీకి రెండు కీలక జాతీయ కార్యక్రమాలు నిర్వహించే బాధ్యతను అప్పగించారు. ఎల్‌కె ఆద్వానీ సోమనాథ్ నుండి అయోధ్య వరకు చేపట్టిన రథయాత్ర ఒకటి కాగా, కన్యాకుమారి (భారతదేశం దక్షిణ భాగం) నుండి కాశ్మీర్ వరకూ చేపట్టిన యాత్ర రెండోది. శ్రీ నరేంద్ర మోడీ నిర్వహించిన ఈ రెండు అత్యంత విజయవంతమైన కార్యక్రమాలతో 1998లో బిజెపి ఢిల్లీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది.


ఈ పరిణామంతో జాతీయ స్థాయిలో మోడీ పేరు ఒక రేంజ్ లో మారుమ్రోగిపోయింది. దీంతో 1995లో శ్రీ నరేంద్ర మోడీని పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమించి, ఆయనకు భారతదేశంలోని ఐదు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. ఒక యువ నాయకుడుగా శ్రీ నరేంద్ర మోడీకి దక్కిన అరుదైన గౌరవం ఇది. 1998లో ఆయనకు జాతీయ కార్యదర్శి (ఆర్గనైజేషన్) గా పదోన్నతి లభించింది. ఈ పదవిలో ఈయన అక్టోబర్ 2001 వరకు ఉన్నారు. ఆ తర్వాత భారతదేశంలోని అత్యంత సంపన్న, ప్రగతిశీల రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన పదవీబాధ్యతలు చేపట్టారు. జాతీయ స్థాయిలో ఉన్న సమయంలో, శ్రీ నరేంద్ర మోడీకి సున్నితమైన, కీలకమైన జమ్మూ కాశ్మీర్‌తో సహా ఈశాన్య రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల శాఖలను పర్యవేక్షించే బాధ్యతను అప్పగించారు. ఆ రకంగా ఆయన పలు రాష్ట్రాల్లో పార్టీని పునరుద్ధరించే బాధ్యతను తీసుకున్నారు. పార్టీ జాతీయ స్థాయిలో వ్యవహారాల్లో శ్రీ నరేంద్ర మోడీ కీలకమైన నేతగా ముందుకు రావడమే కాకుండా పలు ముఖ్యమైన సందర్భాల్లో కీలక పాత్ర పోషించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: