ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించిన నాగ చైతన్య...!

Prathap Kaluva

నాగ చైతన్య అక్కినేని వంటి పెద్ద కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకు నచ్చే సినిమాలు చేస్తూ ముందుకు సాగిపోతున్నాడు. నాగ చైతన్య ఒక ఇంటర్వ్యూ లో తన మనసులోని మాటలు బయట పెట్టాడు.  నా కెరీర్ లో నాకు బాగా ఆనందాన్నిచ్చిన సినిమా ప్రేమమ్. నా మనసుకు బాగా నచ్చిన సినిమా ఇది. ఆ సినిమా చేయొద్దని చాలామంది చెప్పారు. అది వర్కవుట్ కాదన్నారు. కానీ ఎందుకో అది నాకు నచ్చింది. ఎంతమంది వద్దన్నా ఆ సినిమా చేయాలనిపించింది. అందుకే చేశాను. అది నాకు బాగా తృప్తినిచ్చింది. ప్రేమమ్ తర్వాత మనం సినిమా నచ్చింది."


ఇక నచ్చని సినిమాల విషయానికొస్తే దడ, బెజవాడ సినిమాలు ది బెస్ట్ చెత్త సినిమాలన్నాడు చైతూ. ఎలాంటి సినిమాలు చేయకూడదో వాటిని చూసి నేర్చుకున్నానని తెలిపాడు. నా కెరీర్ లో నాకు నచ్చని సినిమాలు దడ, బెజవాడ. నాకు అవి చేదు జ్ఞాపకాలు. అలా అని ఈ సినిమాల విషయంలో నేను ఎవర్నీ వేలెత్తిచూపడం లేదు. నా జడ్జిమెంట్ లోపాలు కూడా ఉన్నాయి కదా. కెరీర్ లో ఏం చేయకూడదో ఆ సినిమాల నుంచి నేర్చుకున్నాను." 


ఇక స్టోరీ సెలక్షన్ విషయానికొస్తే ఒకప్పట్లా తన తండ్రి నాగార్జునపై ఆధారపడడం మానేశానని అంటున్నాడు చైతూ. కేవలం నాగ్ ను ఎడిట్ రూమ్ కే పరిమితం చేసినట్టు స్పష్టంచేశాడు. అప్పుడప్పుడు సమంత సలహాలు మాత్రం తీసుకుంటానని చెప్పాడు. స్టోరీ సెలక్షన్ లో నాన్న మీద డిపెండ్ అవ్వడంలేదు. ఇప్పుడు నా స్టోరీలు నేనే వింటున్నాను. నా కెరీర్ స్టార్టింగ్ లో నా కథలు ఆయన వినేవారు. కానీ గడిచిన 4-5 సినిమాల నుంచి అన్నీ నా నిర్ణయాలే. ఎడిటింగ్ టైమ్ కు మాత్రం నాన్నను తీసుకొస్తున్నాను. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకర్ని నమ్మాలి కదా. అని ఉన్నది ఉన్నట్టు అన్ని విషయాలు చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: