ఓర్నాయనో! చైనా జిడిపి అంతా పచ్చిమోసం అదొక గాలిబుడగ - రష్యన్ డైలీ

చైనా ప్రపంచానికి అర్ధంకాదు! అయినా అర్ధంకాని చోట అక్కడేదో ఉందనేది అర్ధం చేసుకోనోళ్ళ భావన. కాని రష్యా తీరే వేరు. తోంగి చూసైనా అసలు సంగతి తెలుసు కోవటం అక్కడి మీడియా తీరు. అందుకే కొమర్‌సంట్ చైనా ఆర్ధిక వ్యవస్థలోకి అవస్థ పడైనా తొంగి చూసి వివరాలు సంక్షిప్తంగా ప్రపంచానికి చెప్పింది.  

ప్రపంచం లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో చైనా రెండో స్థానంలో ఉందనేది జగమెరిగిన సంగతే. అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 2010 లో జపాన్‌ ను వెనక్కి నెట్టి చైనా రెండో అతి పెద్ద ఆర్ధిక స్థానానికి చేరుకుంది. కానీ ఇలా రెండో స్థానానికి చేరటానికి అది దాని జీడీపీ గణాంకాలను ధారుణంగా మార్చేసిందని రష్యా మీడియా తాజా కథనాలను బట్టి తెలుస్తుంది. "స్వంత ప్రయోజనం కోసం జీడీపీ పేరుతో వంచన" అనే పేరుతో కొమర్‌సంట్ అనే రష్యన్ డైలీ లో చైనా ఆర్ధికంలోని లొసుగులతో ఒక కథనం వెలువడింది. జీడీపీ లెక్కలను కృతిమంగా వండి వార్చిన ఫిగర్స్ తో పెంచి చూపిందని ఆ రష్యన్ డైలీ పేర్కొంది. 

"1980 ల్లో సోవియట్ యూనియన్, జపాన్ కూడా ఇలాగే చేసేవి. ఇప్పుడు చైనా విషయంలో కూడా జరిగింది ఇలాంటి మానిపులేషణే. గతంలో ఆ రెండు దేశాల విషయంలో జరిగిందో ప్రపంచానికి వెల్లడైంది" అని చైనా స్కోప్ అనే రీసెర్చ్ కంపెనీ తెలిపింది. పశ్చిమ దేశాలను ఎదుర్కోవడానికి తప్పుడు జీడీపీ లెక్కల్ని చైనా చూపిస్తుండొచ్చని రష్యన్ మీడియా ఇప్పుడు భావిస్తోంది. చైనా తరహా "అనుత్పాదక ఆర్థిక కార్యకలాపాలు" పశ్చిమ దేశాల్లోనూ ఉన్నాయి. కానీ చైనాతో పోలిస్తే పశ్చిమ దేశాల్లో చాలా తక్కువని - హస్తి మశాంతకం అంత భెదం ఉందని రష్యన్ మీడియా వెల్లడించింది. 

చైనా ఆర్థిక వ్యవస్థ ను ఒక ఆర్థిక విశ్లేషకుడు ఒకరు "గాలిబుడగ -బబుల్" తో పోల్చారు. గాలి బుడగ జీవితం ఓటి పడవ యవ్వనం కాబట్టి బుడగ ఎప్పుడైనా పేలి పోవచ్చని తద్వారా చైనా ఓడ ఏనాడైనా ఏక్షణాన్నైనా మునిగి పోవచ్చని హెచ్చరించారు. 75 శాతం మంది చైనీయుల సంపద "ప్రాపర్టీ మార్కెట్లో" నే ఉందని, దీన్ని బట్టి ఆ దేశ ఆర్ధిక పరిస్థితి ఏంటోనని అర్థం చేసుకోవచ్చని చైనా స్కోప్‌కు ఆ ఆర్ధిక విశ్లేహకుడు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: