నేను బాబు మాదిరి గాలి కబురులు చెప్పను నిప్పులు చెరిగిన జగన్...!

Prathap Kaluva

పాదయాత్ర లో జగన్  చంద్ర బాబు మీద నిప్పులు చెరిగినాడు. మోసగాడివి నువ్వా నేనా, కాపులు నీ విధముగా మోసం చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినాడు. నేను కాపులకు వ్యతిరేకం కాదు. నా మాటలను టీడీపీ వక్రీకరించిందని విమర్శలు చేసినాడు. గాలి కబుర్లు చెప్పి ప్రజల్ని మోసగించడానికి నేను వ్యతిరేకం. ఆమాటే నేను చెప్పాను తప్ప, కాపు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నానని అనలేదు. తెలుగుదేశం పార్టీ తనకు మాత్రమే తెలిసిన కుట్రల్ని నామీద ప్రయోగించింది.


కాపు సామాజిక వర్గానికి వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా వుంటుంది. కాపుల తరఫున పోరాడేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమే. ఎన్నికల వేళ అమలుకు సాధ్యంకాని హామీలు ఇవ్వడం, అధికార పీఠమెక్కాక ఆ హామీల్ని విస్మరించడం చంద్రబాబుకి అలవాటు. అలా ప్రజల్ని తాను మోసం చేయలేనని మాత్రమే స్పష్టంచేశాను. అధికారం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చి ప్రజల్ని మోసంచేసే చంద్రబాబు మోసగాడా.? గాలి కబుర్లు చెప్పబోనని, వాస్తవాలు మాత్రమే మాట్లాడతానని చెప్పే వైఎస్‌ జగన్‌ మోసగాడా.? ప్రజలే తేల్చుతారు.. అంటూ వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.


జగ్గంపేటలో పాదయాత్ర సందర్భంగా వైఎస్‌ జగన్‌, కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలతో పెనుదుమారం రేగింది. నిజానికి జగన్‌ వ్యాఖ్యల్లో తప్పు పట్టడానికేమీ లేదు. అయితే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, అనూహ్యంగా చంద్రబాబు 'అద్దె మైకు'లా మారిపోయి, జగన్‌ మీద విమర్శలు చేయడంతో వివాదం ముదిరి పాకాన పడింది. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ని 'కాపు వ్యతిరేకి'గా చిత్రీకరించేందుకు తెలుగుదేశం పార్టీ పడ్డపాట్లు అన్నీ ఇన్నీకావు. ఈ నేపథ్యంలోనే వైఎస్‌ జగన్‌కి వ్యతిరేకంగా కాపు సామాజిక వర్గానికి చెందిన కొన్ని 'పచ్చచొక్కాలు' ప్రజాసంకల్ప యాత్రలో హల్‌చల్‌ చేశాయి కూడా..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: