బంద్ లు... అరెస్టులు జగన్ సక్సెస్... చంద్ర బాబు దోషి ..!

Prathap Kaluva

వైసీపీఅధినేత జగన్ఇచ్చిన బంద్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బంద్ లో పాల్గొన్నారు. అయితే టీడీపీ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడితే ఆ బంద్ కు మద్దతు ప్రకటించాలి. లేదా తటస్థం గా ఉండాలి. కానీ అధికార పక్షమైన టీడీపీ బంద్ ను ఆపే ప్రయత్నం చేసి, ఎక్కడిక్కడ అరెస్టుల పర్వం మొదలుపెట్టింది.దీనితో జనాలకు టీడీపీ మీద అసహనం కలిగిన మాట వాస్తవం. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏ పార్టీ అయినా దానికి మద్దతు ఇవ్వాలి. కానీ టీడీపీ తీసుకున్న స్టాండ్ ప్రజల్లో వ్యతిరేకత కు కారణం అవుతుంది. 


రాష్ట్ర బంద్‌లో భాగంగా తూర్పుగోదావ‌రి జిల్లా బుట్టాయిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. హోదా కావాలని నిరసిస్తూ  బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు మృతిచెందారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజుతో కలిసి బంద్‌లో పాల్గొన్న దుర్గారావును పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తుండ‌గా ఒక్కసారిగా కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగానే ఆయ‌న‌ మృతిచెందారు. దీంతో దుర్గారావు స్వస్థలం బుట్టాయిగూడెం మండలం కృష్ణాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


ప్రత్యేకహోదా మాట ఎత్తితే జైల్లో పెడుతాన‌ని గ‌తంలో హెచ్చరించిన సీఎం చంద్రబాబు అన్నమాట ప్రకార‌మే బంద్ చేప‌ట్టిన వారిని అరెస్ట్ చేశార‌ని వైసీపీ, ప్రజాసంఘాల నేత‌లు ధ్వజ‌మెత్తారు. ఎలాగైనా బంద్‌ను అణ‌చివేయాల‌ని సీఎం అనుకున్నారే గాని, ప్రజ‌ల ఆకాంక్షల‌పై ఉక్కుపాదం మోపుతున్నామ‌నే విష‌యాన్ని విస్మరించార‌ని వారు ఆరోపించారు. ఆర్టీసీ బ‌స్సులు, ఇత‌ర వాహ‌నాల‌ను పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య తిప్పి జ‌గ‌న్‌ను దెబ్బతీశామ‌నే సంతృప్తి రాష్ర్ట ప్రభుత్వానికి ద‌క్కి ఉండొచ్చు. అంత‌కు మించి రాష్ర్ట ప్రజ‌ల ఆకాంక్షైన ప్రత్యేకహోదా కోసం చేప‌ట్టిన బంద్‌ను అడ్డుకోవ‌డం ద్వారా చంద్రబాబును మ‌రోసారి  దోషిగా నిల‌బెట్టడంలో జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: