అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించబోతున్న మంత్రి కేటీఆర్…!

KSK
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాజకీయాలలో రోజురోజుకీ పరిణితి చెందుతున్నాడు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ స్థాయిలో బిజినెస్ సమ్మిట్ నిర్వహించి దేశంలో ఉన్న అనేక ప్రముఖ రాజకీయ నేతల ప్రశంసలు అందుకున్నాడు కేటీఆర్.


అయితే తాజాగా చూసుకుంటే తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కు అమెరికాలో జరగనున్న గ్లోబల్‌ క్లైమెట్‌ యాక్షన్‌ సమ్మిత్‌పై సదస్సుకు ఆహ్వానం లభించింది. అమెరికాలో జరగనున్న మరోక ప్రఖ్యాత సదస్సుకు హాజరు కావాలని కోరారు. ఈ మేరకు కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌ ఎడ్మండ్‌ జి.బ్రౌన్‌ మంత్రి కెటిఆర్‌కి లేఖ రాసారు.


సెప్టెంబర్‌ 12వ తేది నుంచి 14వ తేది వరకు కాలిఫోర్నియా రాష్ట్రంలోని సాన్‌ఫ్రాన్సిస్కోలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో పాల్గొని ఫ్యూచర్‌ ఆఫ్‌ ఎనర్జీ అండ్‌ ట్రాన్సోర్ట్‌ సిస్టం అనే అంశంపై ప్రసంగించాలంటూ మంత్రి కెటిఆర్‌ని లేఖలో కోరారు.


ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి హాజరవుతున్న ప్రతినిధులకు వాతావరణ మార్పులకు ప్రభుత్వాలు తీసుకుంటున్న కార్యక్రమాలపై చేసే ప్రసంగం ఉపయుక్తంగా ఉంటుందని గవర్నర్‌ తెలిపారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచంలో ఉన్న చాలామంది ప్రముఖులు హాజరవుతున్నట్లు కాలిఫోర్నియా గవర్నర్ ఆహ్వాన పత్రికలో తెలిపారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: