తమిళనాడు రాష్ట్రంలో క్లాస్ రూమ్ లోనే ఒక విద్యార్థిని చంపేసిన మరో విద్యార్థి…!

KSK
ప్రస్తుత సమాజంలో మనుషులు జంతువుల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఒకపక్క రేపులు లైంగిక వేధింపులతో అమాయకులైన ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతుంటే..మరోపక్క అక్రమ సంబంధాలతో కుటుంబాలు కూలిపోతున్న విషాదఛాయలు ప్రస్తుత సమాజంలో అలుముకున్నాయి. ఇదిలావుండగా తాజాగా ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో ఓ స్కూల్లో తోటి విద్యార్థిని మరొక విద్యార్థి నేలకేసి కొట్టి చంపేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోయంబత్తూరు జిల్లా కయత్తూరులోని ఫాతిమా మెట్రిక్యులేషన్‌ స్కూల్‌లో ఓ విద్యార్థిని సహ విద్యార్థి నేలకేసి కొట్టాడు.


తల నేలకు బలంగా తగలడంతో ఆ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. వారం రోజుల క్రితం (జూలై 16న) ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఉదంతం మొత్తం క్లాస్‌ రూమ్‌ లోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. భోజన విరామ సమయంలో టెన్త్ క్లాస్ కి చెందిన ఇద్దరు స్టూడెంట్స్ మధ్య గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. వీధి రౌడీలా గొడవల తరహాలో ఓ స్టూడెంట్ మరో విద్యార్థిని క్లాస్‌ రూమ్‌లో నేలకేసి కొట్టాడు.


అయితే కిందపడిన విద్యార్థి పైకి లేస్తాడనుకున్నా...అప్పటికే అతడు చనిపోయాడు. కాగా  మృతి చెందిన విద్యార్థి కుటుంబసభ్యులు మాత్రం కావాలనే తమ కుమారుడిని తోటి విద్యార్థి హతమార్చాడంటూ ఆరోపించారు. అంతేకాకుండా ఆ విద్యార్థి ఇంటిపై దాడి చేసి, నిప్పు పెట్టారు.


ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ విద్యార్థి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ కి సంబంధించిన అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా జరిగిన ఈ ఉదంతంతో స్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు చాలా భయాందోళనకు గురవుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: