టిడిపికి దాని దౌర్జన్యాలకు ప్రజలు గుణపాఠం చెపుతారు: బిజెపి మాజీమంత్రి కృష్ణంరాజు

ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అండ చూసుకొని తమ అధినేతను ప్రశ్నించిన వారిపై భౌతికదాడులకు దిగుతోందని మండి పడ్డారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కృష్ణం రాజు. ప్రభుత్వంలో ఉండే, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న టీడీపీకి సమయం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రతివారం ఐదు ప్రశ్నలు అడుగుతున్నా, వాటికి పొంతన లేకుండా సమాధానమిస్తూ టీడీపీ నేతలు, ప్రజలను గందరగోళ పరుస్తున్నారన్నారు. కన్నా లక్ష్మీనారాయణపై చెప్పులు వేసి రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ప్రజలు మెచ్చుకొనేలా మంచిపనులు చేయాలని సూచించారు.
 
మరోవైపు పంటలకు మద్దతు ధర ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వరి పంటకు ₹200/- మద్దతు ధర ప్రకటించటం వల్ల ఎకరాకు కనీసం 6వేల నుంచి 8వేల లాభం రైతుకు లాభం చేకూరుతుందన్నారు. జులై మొదటి వారంలో మద్దతు ధర ప్రకటించటంతో రైతులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపశమనం లభిస్తుందని, పంట కొనుగోలు భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడకుండా కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందన్నారు. 

2022నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయటమే బీజేపీ లక్ష్యం అని కృష్ణంరాజు చెప్పారు. పంటలకు మద్దతు ధర ప్రకటించటం పట్ల ప్రధాని నరెంద్ర మోదీకి కృతజ్ఞత లు తెలియజేశారు. 33ఏళ్లలో ఇంత పెద్ద మొత్తంలో మద్దతు ధర పెరగలేదని, బీజేపీ రైతు పక్షపాతి అనడానికి ఇదే నిదర్శనమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: