పార్లమెంటుకు బిజెపి - శాసనసభకు ప్రాంతీయ పార్టీ: ఒక ఆసక్తికర సర్వే

దేశం 2019 ఎన్నికలవైపు పరుగులు తీస్తుంది. ఎక్కడ చూసినా రానున్న ఎన్నికల గురించే చర్చలు. మన రాష్ట్రంలో 'ఏబిఎన్ ఆర్కె ఫ్లాష్ సర్వే' లో ప్రాంతీయ తెలుగుదేశం అప్రతిహత విజయం సాధిస్తుందన్న నివేదిక వచ్చింది. కాకపోతే అది నిజం కాదు ప్రత్యేకంగా ఒక పార్టీ అధినేత ఆదేశం మేరకు వండి వార్చిన సర్వే అనేది జనానికి తెలిసి పోయింది.   
  
అయితే మరో సర్వే ఆసక్తికరంగా ఉంది, ఇప్పుడు కనుక ఎన్నికలు జరిగితే అక్కడ అదే డిల్లీలో - ఆమ్ ఆద్మి పార్టీకి - ఆప్, బిజెపికి పోటీ చాలా గట్టిగానే ఉండవచ్చని అని వెల్లడైంది. అయితే ఆప్ కు స్వల్ప ఆదిక్యత ఉండవచ్చంటున్నారు. కాగా లోక్-సభ ఎన్నికలలో మాత్రం బిజెపి స్పష్టమైన ఆదిక్యతను ఇక్కడ పొందవచ్చని ఆ సర్వే వెల్లడించింది. 

అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆప్‌కు 39 శాతం, బీజేపీకి 38 శాతం ఓట్లు వస్తాయని తాజా సర్వే వెల్లడించింది. ఆప్‌కు 2015 ఎన్నికల్లో 54.30 శాతం ఓట్లు రాగా, తాజాగా 39 శాతానికే పరిమితం కానుంది. బీజేపీకి గతంలో 32.30 శాతం ఓట్లు రాగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 38 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే తేల్చిందట. ఇక అరవింద్ కేజ్రీవాల్‌ ప్రభుత్వ పనితీరుపై 67 శాతం మంది సంతృప్తి వ్యక్తంచేయడం విశేషం.

ఆప్ కు ఓట్ల శాతం తగ్గినా, బిజెపికి పెరిగినా, ఆప్ కు అదికారం దక్కవచ్చు. లోక్‌సభ ఎన్నికలు జరిగితే  మాత్రం ఢిల్లీ ఓటర్ల మద్దతు బీజేపీకే. 40 శాతం ఓటర్లు బీజేపీకి ఓటేస్తామని బల్లగుద్ది చెప్పగా, 25 శాతం మంది మాత్రం ఆప్‌కు, 24 శాతం మంది కాంగ్రేస్ కు ఓటేస్తామని చెప్పడం ఈ సర్వేలో వెల్లడైన విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: