చంద్ర బాబుకు 'గోదావరి' కష్టాలు...!

Prathap Kaluva

జగన్ ప్రజా సంకల్ప యాత్ర అన్ని జిల్లాలో విజయవంతం అవుతూ దూసుకు పోతుంది. అయితే ఇప్పటికే 2,400 కిలో మీటర్లు పూర్తి చేసిన జగన్ తాజాగా తూర్పు గోదావరి లో జిల్లాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే తూర్పు గోదావరి జిల్లాలో  ప్రజలు ఇచ్చిన ఆహ్వానం చూసి టీడీపీ గుండెల్లో గుబులు మొదలైనట్టుంది.  అశేష జనవాహిని నడుమున జగన్ తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించాడు. 


మిగతా జిల్లాలన్నిటితో పోల్చితే, చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ, ఉభయగోదావరి జిల్లాల్లోనూ ప్రజా సంకల్ప యాత్రను వైఎస్‌ జగన్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లే కన్పిస్తోంది. ఆ తర్వాతి స్థానంలోకి కృష్ణా, గుంటూరు జిల్లాలు చేరుతాయి. ఆయా జిల్లాల్లో ప్రవేశిస్తున్నప్పుడు, వైఎస్‌ జగన్‌కి జనం హారతి పట్టిన తీరు చూస్తే, ఫస్ట్‌ ప్లేస్‌ ఖచ్చితంగా తూర్పు గోదావరి జిల్లాకే దక్కుతుంది. చిత్తూరు అయినా, కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి.. ఆఖరికి జగన్‌ సొంత జిల్లా కడప అయినా ఆ తర్వాతి స్థానాల్లోకే వెళతాయి.


తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించే క్రమంలో గోదావరి బ్రిడ్జిపై జనసంద్రం 'నభూతో న భవిష్యతి' అనేలా సాగిందన్నది నిర్వివాదాంశం. ఆ తర్వాత దవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌పైనా దాదాపు అదే పరిస్థితి. గోదావరి లంక గ్రామాల్లో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గోదావరి కాలువల్లో వైఎస్సార్సీపీ అభిమానులు పార్టీ జెండాలతోపాటు, జగన్‌ ప్రకటించిన నవరతాల్ని ప్రదర్శిస్తూ, జగన్‌ పాదయాత్రకు కొత్త ఉత్సాహాన్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: