ముంబాయిలో 45 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం!

Edari Rama Krishna
ముంబయిలోని వర్లి ప్రాంతంలోని 45 అంతస్తుల ఓ వాణిజ్య సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అబ్బాసాహేబ్‌ మరాఠే మార్గ్‌లో ఉన్న భీముండే‌ టవర్స్‌లోని 33వ అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ కావడంతో మంటలు ఆర్పడానికి విఫల ప్రయత్నం చేస్తున్నారు. 33వ అంతస్తులో మంటలు చెలరేగడంతో దానిపై భాగంలో ఉన్న ఫ్లాట్‌లు కూడా దెబ్బతిన్నాయి.

అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో వచ్చి మంటలు ఆర్పుతున్నారు. 95 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన ఎలా చోటు చేసుకుందన్న విషయం తెలియాల్సి ఉంది. కాకపోతే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని..చిన్న గాయాలు అయిన వారికి దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

అయితే ఇదే టవర్ లో బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకుణె నివాసం ఉంటోంది.  సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
#WATCH: Level III fire breaks out in Beau Monde Towers in Worli's Prabhadevi locality. Firefighting operations underway. #Mumbai pic.twitter.com/su2hKDEGr3

— ANI (@ANI) June 13, 2018 #UPDATE Level - III fire in a building at Appasaheb Marathe Marg in Prabhadevi locality in Worli: 10 fire tenders, 2 quick response vehicles, 5 water tankers, 2 ambulances present at the site. No casualties reported. Firefighting operations underway. #Mumbai pic.twitter.com/KM5n90S0xC

— ANI (@ANI) June 13, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: