టీడీపీ మహానాడులో మొత్తం నా పేరు జపం చేశారు: జగన్

KSK
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత జగన్ తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు పై విరుచుకుపడ్డారు . మహానాడు మొత్తం అబద్ధాలతో మోసాలతో నిండిపోయింది అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహానాడు వేదికగా అబద్ధాల పోటీ జరిగింది అని జగన్ టీడీపీ మహానాడును ఎద్దేవా చేశారు. జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.


పశ్చిమగోదావరి ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా నరసాపురం జిల్లాలో జరిగిన మహా సభలో జగన్ మాట్లాడుతూ నయ వంచన, వెన్నుపోటు, మోసం, దగా, కుట్ర తదితరల అంశాలపై మహానాడులో అంతర్జాతీయ పోటీలు జరిగాయన్నారు. ఈ పోటీల్లో చంద్రబాబు గత 25 సంవత్సరాల నుండి తొలిస్థానంలో నిలిచి తుప్పు అన్న బిరుదును సొంతం చేసుకున్నారని జగన్ వ్యాఖ్యానించారు.


రెండో స్థానంలో నారా లోకేష్ నిలిచి పప్పు అన్న బిరుదును నిలుపుకున్నారని సెటైర్లు వేశారు. అంతేకాకుండా అబద్ధాలు చెబుతూ రాష్ట్ర ప్రజలకు లేనిపోని హామీలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్ మత్స్యకారులని ఉద్దేశించి మాట్లాడుతూ...మత్స్యకారులకు కొత్త బోట్లు ఇవ్వడంతో పాటు వేట విరామ సమయంలో వారికి నెలకు రూ.10వేలు, మత్స్యకారులు ప్రమాదవశాత్తూ చనిపోతే బీమా కింద పది లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.


బోట్ల కోసం డీజిల్‌పై సబ్సిడీ ఇస్తామన్నారు. మహానాడులో మొత్తం తెలుగుదేశం నాయకులు...చంద్రబాబు గారు అంత జగన్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు అని అన్నారు జగన్. ఇంత దారుణంగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు రాబోయే రోజుల్లో తగిన విధంగా మూల్యం చెల్లించుకుంటారు అని అన్నారు. అంతేకాకుండా పైనున్న దేవుడు కూడా చంద్రబాబు చేస్తున్న మోసాలకు మొట్టికాయలు వెస్తారని పేర్కొన్నారు జగన్.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: