పవన్ కళ్యాణ్ టీడీపీ కి తన 'పవర్' ను చుపించాలనుకుంటున్నాడా...!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ ఉద్దానం భాదితుల సమస్యలు పరిష్కరించమని టీడీపీ కి డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోగా ఉద్దానం భాదితులకు చాలా చేశామని ఎదురు దాడికి దిగారు. దీనితో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు గా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. దానికి తగినట్లుగానే.. పవన్ దీక్షకు అనుమతుల విషయంలోకూడా ఇబ్బందులు ఎదురయ్యాయి.


మునిసిపల్ గ్రౌండ్స్ లో గానీ, ఎన్టీఆర్ స్టేడియంలో గానీ నిరాహార దీక్ష చేయడానికి పవన్ దరఖాస్తు చేసుకుంటే, పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. రకరకాల సాకులు చెప్పి నిరాకరించారు. దీంతో తాను బస చేసిన రిసార్ట్స్ లోనే ఆహారం మానేసి నిరాహార దీక్షకు దిగినట్లుగా మీడియాకు ప్రకటింపజేసిన పవన్ కల్యాణ్.. శనివారం నాడు అక్కడినుంచే ప్రజల మధ్యకు వెళ్లి దీక్ష చేస్తానని ప్రకటించారు.


‘‘వేదికలు వేసుకుని దీక్ష చేయడానికి అనుమతి ఇవ్వలేదు సరే. నేరుగా నేను ప్రజల మధ్యలోకి వెళితే మీరేం చేయగలరు?’’ అని ప్రభుత్వ వ్యవస్థను నిలదీస్తున్నట్లుగా పవన్ దీక్ష సాగుతున్నట్లుంది. పైగా పవన్ కు మద్దతుగా అన్నట్టు రాష్ట్రవ్యాప్తంగా దీక్షలకు రంగం సిద్ధం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ యాత్రచేస్తూ జనంలో తిరుగుతోంటేనే నానా గందరగోళం రభసలు అవుతున్నాయి. అలాంటిది ఆయన నిరాహార దీక్ష పేరిట ప్రజల్లోకి వెళ్లిపోతే.. నియంత్రించడం కష్టం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: