బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తాం : నారా లోకేష్

Edari Rama Krishna
విభజన సమయంలో ఏపికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందన్న నమ్మకంతో బీజేపీతో పొత్తు కొనసాగించామని..కానీ ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ప్రజలకు అన్యాయం చేస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని స్పష్పం చేసిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారని..ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీతో అయినా కలసి పనిచేసేందుకు సిద్ధమేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇకపై బీజేపీ ఏ రాష్ట్రంలోనూ గెలిచే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. బీజేపీపై పోరాడేందుకు అన్ని పార్టీలూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని అన్నారు.  ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా ఈ పోరాటంలో పాల్గొంటూ..నిరాహార దీక్ష, ధర్మాపోరాట సభలు నిర్వహించారని..ప్రజలు కూడా తెలుగు దేశం సభ్యులతో కలిసి పోరాడాలని ఆయన అన్నారు.

ఏపీలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, అన్ని పార్టీల నేతలనూ ఆహ్వానించే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని తెలిపారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారని, ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తేనే బీజేపీకి బుద్ధి చెప్పేందుకు వీలవుతుందని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: