కిడ్నీ బాధితుల పాలిట దైవం జగన్ - పశ్చిమ లో చేతులెత్తి మొక్కారు !!

KSK
జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ఆంధ్ర రాజకీయాలలోనే కాకుండా దేశంలో సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో సాగుతోంది. ఈ నేపధ్యంలో గత ఎన్నికల వాతావరణానికి భిన్నంగా జగన్ కి పశ్చిమ ప్రజలు నీరాజనం పడుతున్నారు. చంద్రబాబు పాలన ఎంత ఇబ్బందికరంగా ఉందొ జగన్ కి చెప్పుకుంటున్నారు వారు. అనవసరంగా 2014 ఎన్నికలలో మొత్తం స్థానాలన్నీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చామని పశ్చాతాప పడుతున్నారు. అయితే జగన్ వేస్తున్న ప్రతి అడుగులో ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

అధికారంలోకి రాకముందే ముఖ్యమంత్రిగా ఎలా ఉంటాడో కష్టాలతో వస్తున్న ప్రజలకు అండగా నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిరుపేద కుటుంబానికి చెందిన వెంకట్రా వమ్మ.. రెండు కిడ్నీలూ పాడైన తన కొడుకును తీసుకొచ్చింది. జన్మనిచ్చిన ఆ తల్లి తన కిడ్నీ ఇచ్చి పునర్జన్మ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ వైద్యసాయం అందించేదెవరు? మన రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాల్లేవు. హైదరాబాద్‌ లోనేమో ఆరోగ్యశ్రీ వర్తించదు. ప్రభుత్వం ఇచ్చే అరకొర నిధులతో కిడ్నీ ఆపరేషన్లు చేయలేమంటూ ప్రయివేటు ఆసుపత్రుల వారు చేతులు ఎత్తేసారు.

లక్షలు ఖర్చుచేసి వైద్యం చేయించలేని దీనస్థితి. చూస్తూ చూస్తూ కొడుకు ప్రాణాన్ని గాలికొదిలేయలేని దయనీయ పరిస్థితి. ఇదీ.. బాబుగారి ఏలుబడిలో సామాన్య ప్రజల దుస్థితి. మరోవైపు ప్రజారోగ్యానికి మూలస్తంభా లైన వైద్యులు, సిబ్బంది కలిశారు. సేవలం దించడానికి సిద్ధంగా ఉన్నా.. సదుపాయాల కొరత అడ్డుకుంటోందని ప్రభుత్వ వైద్యులు, సంవత్సరాల తరబడి బిల్లులే చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ కింద కేసులెలా చేస్తామని ప్రయివేటు డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగు లంటూ సంక్షేమ పథకాలు అందనీయరు.. పోనీ ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే పింఛన్లు, హెల్త్‌ కార్డులు తదితర సౌకర్యాలు కల్పించరు.. రెంటికీ చెడ్డ రేవడిలా ఉన్నామంటూ వైద్యారోగ్యశాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులు వాపోయారు.

ఈ క్రమంలో వెంకట్రావమ్మ కొడుకు కిడ్నీ ఆపరేషన్ విషయంలో జగన్ నేరుగా కలుగజేసుకొని తన సిబ్బంది చేత అక్కడ ఉన్న నాయకుల చేత ఆ కేసును టేకప్ చేసి వైద్య సదుపాయం పూర్తిగా అందేంత వరకు తానే చూసుకుంటానని వారికి ధైర్యం చెప్పి ఆపరేషన్ చేయించడానికి అన్ని ఏర్పాట్లు చూసుకుంటన్నానని తెలిపాడు. ఇటువంటి సంఘటనలు ప్రజాసంకల్ప పాదయాత్రలో ఎన్నో చోటుచేసుకున్నాయి ...ఈ నేపథ్యంలో అసలు వ్యాధి కారణానికి మూలాలు కూడా తెలుసు కోవాలని తన వెనక ఉన్న వారికి ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు జగన్. ఏదిఏమైనా అధికారంలోకి రాకముందే ఆరోగ్యశ్రీని అమలు చేసేస్తున్నాడు జగన్ అని అంటున్నారు రాజకీయవిశ్లేషకులు .. ఉద్దానం అంటూ కొన్నాళ్ళు ఎగిరారు పవన్ కళ్యాణ్ - చంద్రబాబు కానీ అక్కడ ఫలితం దక్కలేదు, కానీ జగన్ దానికి భిన్నంగా స్పాట్ లో హెల్ప్ చెయ్యడం గొప్ప విషయం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: