పవన్ మరోసారి క్లారిటీ 175 స్థానాల్లో... జనసేనకు అంత సీన్ ఉందా..!

Prathap Kaluva

ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. తన పార్టీ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయబోతోందని అది కూడా ఒంటరిగా అని స్పష్టత ఇచ్చాడు. అయితే ఇదే విషయాన్ని రెండో సారి కూడా చెప్పాడంటే ఇదే నిజమనుకోవచ్చు. అయితే ఇన్ని  రోజులు కమ్యూనిస్టులు పవన్ కళ్యాణ్ మీద ఆశలు పట్టుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ తో ఒక్క సారిగా కమ్యూనిస్టులకు దిమ్మ తిరిగిందని చెప్పవచ్చు. 


ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలతో కలిసి బరిలోకి దిగాలనే ఆలోచన చేసిన పవన్‌ కొంతకాలంగా ఒంటరి పోటీ గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఆయన సొంత ఆలోచనో, ప్యూహకర్త దేవ్‌ వ్యూహమో తెలియదు. తన బలమెంతో తనకు తెలియదని, ఎన్ని స్థానాల్లో బలముంటే అన్ని స్థానాల్లోనే జనసేన పోటీ చేస్తుందని ఒకప్పుడు చెప్పాడు. ఇప్పుడు అన్ని స్థానాల్లో పోటీచేసేంత బలం వచ్చిందని భావిస్తున్నాడని అర్థమవుతోంది. ఇప్పటివరకు బలం అంతగా లేకపోయినా త్వరలోనే ప్రారంభమయ్యే బస్సు యాత్ర కారణంగా బలం పెరుగుతుందని భావిస్తుండవచ్చు.


జనసేన, లోక్‌సత్తాతో కలిసి కూటమి కడతామని  రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈమధ్య మీడియాకు చెప్పారు. ఒంటరి పోటీ అని పవన్‌ చెప్పాక రామకృష్ణ ఇలా ఎందుకు చెప్పారో తెలియదు. జనసేన, లోక్‌సత్తాతో కలిసి కూటమి ఏర్పాటు రామకృష్ణ వ్యక్తిగత అభిప్రాయం కావొచ్చు. కూటమిగా ఏర్పడాలనేది విధాన నిర్ణయమైతే అందరూ ఉమ్మడిగా ప్రకటన చేసేవారే. ఏపీ రాజకీయాల గురించి లోక్‌సత్తా జయప్రకాశ్‌ నారాయణ ఇప్పటివరకు మాట్లాడిన దాఖలాలు లేవు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: