రాహుల్ ఇచ్చిన హామీ మోడీ ఇవ్వగలడా..!

Prathap Kaluva

కన్నడ ఎన్నికల ప్రచారం రెండు పార్టీల మధ్య ప్రచంఢ యుద్ధం లా కొనసాగుతుంది. కన్నడ ప్రజల మీద అన్ని పార్టీల అధినేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. కర్ణాటకలో కన్నడ ప్రజలే కాదు. తెలుగు ప్రజలు కూడా ఎంతో ముఖ్యం అని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు ప్రజలను ఆకట్టుకోవడానికి రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక హోదా విషయం లో బీజేపీ చేసిన నయ వంచన తెలుగు ప్రజలను బీజేపీ కి వ్యతిరేకంగా ఓటు వేసే విధంగా చేస్తుంది.


ఇంతకూ రాహుల్ ఏం చెప్పారంటే.. తాము గనుక కేంద్రంలోకి అధికారంలోకి వస్తే.. వెంటనే ఏపీకి అధికార హోదా ఇస్తాం అని రాహుల్ ప్రకటించారు. అలాగే పెండింగ్ లో ఉన్న విభజన చట్టం హామీలు అన్నిటినీ కూడా వెంటనే నెరవేరుస్తాం అని కూడా రాహుల్ హామీ ఇచ్చేశారు. తెలుగు ప్రజల పోరాటానికి ఇప్పటికే తాము మద్దతు ఇచ్చాం అని కూడా ఆయన ఇటీవలి పార్లమెంటు పరిణామాలను ఏకరవు పెట్టారు.


కన్నడ సీమలో ఇచ్చిన హామీనే అయినప్పటికీ.. ఏపీలోని అయిదు కోట్ల మంది తెలుగు ప్రజలకు కూడా ఇది సంతోషం కలిగించవచ్చు. అయితే రాహుల్ చెప్పే ప్రతి మాటను కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్న నరేంద్రమోడీ.. ఈ మాటలను కౌంటర్ చేయగలరా? అనేది తెలుగు ప్రజల ప్రశ్న. ఏపీ పట్ల పాల్పడిన వంచన దృష్ట్యా.. అసలు తన నోటితో ప్రత్యేకహోదా మాటెత్తేంత ధైర్యం మోడీకి ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: