ఆ పని చేస్తే దేశంలో బిజెపి ఉండదు!

KSK
కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో నాయకుల మధ్య మాటల తూటాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేంద్రమంత్రి అనంత కుమార్ హెగ్డే పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఒక కులానికి సంబంధించిన భారీ బహిరంగ సభలో కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే రాజ్యాంగాన్ని అవమానించే రీతిలో మాట్లాడారు.

దీంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య భారతీయ జనతా పార్టీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గ్రామ పంచాయతీ నేతగా కూడా పనికిరాని అనంత్ కుమార్ హెగ్డెలాంటి అసమర్థుడిని కేంద్ర మంత్రిని చేశారంటూ బీజేపీని విమర్శించారు.గతంలో కూడా హెగ్డే త్వరలో రాజ్యాంగాన్ని మారుస్తామని చాలా ఘాటుగా కామెంట్ చేశారు...దీంతో సిద్దిరామయ్య మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మారిస్తే దేశంలో రక్తపాతం జరుగుతుందని హెచ్చరించారు.

ఇలాంటి వైఖరి కలిగిన నాయకులు దేశంలో ఉంటే రక్తపాతాలు అలాగే దేశం చాలా ముక్కలు అయిపోతుందని వ్యాఖ్యానించారు. అయితే తాజాగా కేంద్ర మంత్రి అనంత కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ...బిజెపి తన రహస్య ఎజెండా మెల్ల మెల్లగా బయటకు తీస్తుంది అన్ని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో సగం రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉండటంతో బిజెపి నాయకులు తెగ రెచ్చిపోతున్నారు అని అన్నారు.

ఒకవేళ నిజంగానే బిజెపి  రాజ్యాంగం... రిజర్వేషన్ జోలికి వస్తే.. బిజెపి భారతదేశంలో ఉండదు అని అన్నారు. ఎందుకంటే ప్రస్తుతం దేశ జనాభాలో 30 కోట్ల మంది దళితులు ఉన్నారని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: