టిడిపి యంత్రాంగం జాతీయ మీడియాను కూడా మానేజ్ చేసిందా? అంత సులభమా?

వ్యక్తులను, వ్యవస్థలను, సంస్థలను మానేజ్ చేయటం టిడిపి అధినేతకు వెన్నతో పెట్టినవిద్య. ఈ విషయం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పాలుతాగే  పసి బాలుణ్ణుంచి వయసులో పండి పోయిన జవసత్వాలుడిగిన వృద్దులవరకూ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ వారు మహాపండితులా? లేక అక్షర ఙ్జానశూన్యులా?  అనే ద్వైధీభావం కనిపించనంత.  కాకపోతే వాళ్ళకు కూడా తెలియనంతగా వాళ్ళే మానేజ్ అయిపోతారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అయినా బుట్టా  రేణుక అయినా,  లింగ, కుల, వర్గ, ప్రాంత భేదం కూడా ఉండదు.

అయితే ఆంధ్రప్రదెశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రజెంటేషన్, ఆ సందర్భంగా: 

ఆయన చేసిన వ్యాఖ్యలను గమనించారా? 

అదే సమయంలో అక్కడ ఉన్న ఎమ్.పిల లో ఒక మహిళా ఎమ్.పి ని కూడా చూశారా? 


ప్రత్యేక హోదా, విభజన హామీలకు సంబందించి ఆయన తన వాదన ఒక పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వినిపించే ప్రయత్నం చేశారు. అందులో తప్పు లేదు. కాకపోతే వాటిలో ఎన్ని వాస్తవాలు, ఎన్ని అవాస్తవాలు అన్నది జాతీయ మీడియా కు ప్రస్తుతం లేదా అసమయానికి తెలియదు కనుక ఆయన తను చెప్పదలచు కున్న వాటిని చెప్పి కార్యక్రమాన్ని ముగించారు. 

ఆ క్రమంలో కూడా ఆయన పనిలో పనిగా తన నలభై ఏళ్ల రాజకీయ జీవితం గురించి, నిప్పులాంటి తన విశ్వసనీయత (క్రెడిబిలిటి) గురించి తనకై తాను చెప్పడం మర్చి పోలేదు అంటే "ఆత్మస్తుతి"  నిను వీడని నీడను నేను లాగా - వెంటాడుతూనే ఉంది. 

నిజంగానే చంద్రబాబు నాయుడు కు:
అంత విశ్వసనీయత, 
రాజకీయ స్వచ్చత, 
నిప్పులాంటి నైతికత ఉంటే, 

అక్కడి మీడియా కు అన్ని విషయాలు తెలిసి ఉంటే తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులతో పాటు వైసిపి పక్షాన ఎన్నికైన కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక అక్కడ ఎందుకు ఉందని ప్రశ్నించే వారు కదా? దీన్నిబట్టి చంద్రబాబు గారి విశ్వసనీయత - విషయంపై మీడియా పరిఙ్జాన లేమి స్పష్టంగా ఆ రెండిటికి కురదని సాపేక్షత-కలిపిచూస్తే అక్కడ జరిగిన "సమాచార నిర్వహణ తీరు అంటే మీడియా మానేజ్మెంట్" జాతీయస్థాయిలో కూడా అతి సులభంగా చేయగలరని అర్ధమవుతుంది.   

మీడియా మానేజ్మెంట్ లేకుంటే అక్కడ మీడియా "ఇదేనా మీ విశ్వసనీయత" అని అడిగి ఉండాలి కదా! అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపి లను ఎన్ని కోట్ల రూపాయలకు వెచ్చించి బజార్లో గొర్రెలను, కూరగాయలను కొన్నట్లు కొనుగోలు చేశారని అదగాలి కదా!! నలుగురు వైసిపి ఎమ్మెల్యేలకు తెలుగుదేశం కాబినెట్ లోకి మంత్రులుగా ఎలా చేర్చుకున్నారని అడిగి ఉండాలి కదా!!! కాబట్టి ఇక్కడ మీడియా కు ఈ విషయ పరిఙ్జానం లేదని చెప్పాలి అలాకాకపోతే వారు మానేజ్ అయి ఉండాలని అభిజ్ఞవర్గాల అభిప్రాయం. 

వైసిపి ఎమ్.పి విజయసాయి రెడ్డి ప్రధాని కార్యాలయం వద్దకు వెళ్లడాన్ని ఆక్షేపించినప్పుడు టిడిపి ఎమ్.పిల పై ఉన్న కేసుల గురించి, 'ఓటుకు నోటు కేసు' లో చంద్ర బాబు పాత్ర గురించి, పలువురు టిడిపి ఎమ్.పిలు, ఎమ్మెల్యేల పై ఉన్న కేసుల గురించి, తాజాగా విజయ్ మాల్యా నుంచి టిడిపి ₹150 కోట్ల ఎన్నికల విరాళం తీసుకున్నా రని విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణ గురించి కాని అడిగేవారు కదా!! 

"మీడియా మేనేజ్ మెంట్ ఎక్స్పెర్ట్" గా జగ్ద్విదితంగా కీర్తి గడించిన చంద్రబాబు నాయుడు ఈ విషయాలు ప్రస్తావనకు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ఉండాలి. ఇక హైదరాబాద్ ను తానే నిర్మించానని ఎంత మొహ మాటం లేకుండా చెప్పేసినా అక్కడి మీడియా అదెలా సాద్యం అని అడగలేదు సరికదా 400 యేళ్ళ హైదరాబాద్ చరిత్రను గుఱించని ఆ మీడియా కూడా మానేజ్ అయిపోయి ఉండవచ్చు! 

ఏ ప్రభుత్వం ఉన్నా, ఎంతో కొంత అబివృద్ది జరుగుతుంది. అలాంటిది నిస్సిగ్గుగా హైదరాబాద్ నగరాన్ని తానే నిర్మించానని, మరో నగరాన్ని ఇప్పుడు నిర్మిస్తున్నానని ఆయన చెబుతున్నా రు. దీనికి మాత్రం కేంద్రం నిదులు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. అయితే ఇచ్చిన నిధులతో వివిధ నిర్మాణాలు చేపట్టినట్లు "తప్పుడు యుటిలైజేషన్ సర్టిపికెట్లు" పంపారన్న ప్రశ్న వస్తే ఏమి చెప్పి ఉండేవారు? అసలా ప్రశ్న వేయని మీడియాకు విషయ పరిఙ్జాం లేదనుకోవచ్చా? 

ఒకటి మాత్రం వాస్తవం. ప్రదాని నరెంద్ర మోడీ ఆయా సభలలో రాజదాని గురించి చేసిన వ్యాఖ్యలను వీడియోతో సహా నారా చంద్రబాబు నాయుడు చక్కగా వాడుకొని తన ప్రచార పటాటోపం ప్రదర్శించారు. అదే సమయంలో ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు ఎన్ని సార్లు మాటలు మార్చి యూ-టర్న్ తీసుకున్నదాన్ని జాతీయ మీడియా ఎందుకు ప్రశ్నించలేదు. 

ప్రత్యేక హోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏమి బాగుపడ్డాయి? అని చంద్రబాబు అప్పట్లో ఎందుకు ఏలా వాదించారో? అని ఎందుకు నిగ్గదీయలేదో? పైగా అవిశ్వాసతీర్మానం పెట్టిన వైసిపికి  బిజెపికి ఆయన చేసిన అనుసంధానం (లింక్ పెట్టి మాట్లాడే తత్వం) గుఱించి ఆయన ప్రయత్నం చేశారు. నాలుగేళ్లు అదికారంలో కలిసి ఉన్నవారు ఈ ఆరోపణ చేయడమే విచిత్రంగా, వింతగా, విడ్డూరంగా ఉంది.

మొత్తం మీద చూస్తే చంద్రబాబు నాయుడిలో లో ఒక విధమైన భయం, ఏమీ చెయలేక పోతున్నామన్న నిర్లిప్తత, మానసిక మాంధ్యం ఆయన ముఖంలో స్పష్టంగా కని పించింది. అలసట కారణం అని అనవచ్చు టిడిపి వాళ్లు. అలసట లో ముఖం కళ తప్పదు, జీవం కోల్పోదు.  తన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, తనను, తన ప్రభుత్వాన్ని ప్రధాని నరెంద్ర మోడీ , బిజెపి ప్రభుత్వం వేధిస్తోందని, చెడానికి చంద్రబాబు ఎక్కువ ప్రాదాన్యం ఇచ్చారు. తన చేతకాని తనాన్ని పరనింద  రూపంలో  — అసమర్ధతలోని ఆఖరి ఆక్రందనగా కనిపించింది ఆ క్షణాన. 
అంటే దానర్దం తన పై ఏ ఆరోపణ వచ్చినా వాటిని పట్టించుకోరాదని ఆయన దేశ జనావళిని ఒక 'ప్రార్ధన రూపంలో మెత్తగా డిమాండ్ చేస్తున్నారు"  అనిపిస్తుంది. ఒక వేళ వాటి పై విచారణ జరిగితే ముందస్తుగానే "అదంతా కేంద్ర ప్రభుత్వ వేదింపు చర్య" అని ప్రచారం చేయడానికి తన స్వంత మద్దతు మీడియాని సిద్దం చేసినట్లుగానే జాతీయ మీడియాని జాతీయ స్థాయిలో సిద్ధం చేస్తున్నరని పిస్తుంది. 

వైసిపి ఎమ్.పి విజయసాయిరెడ్డి చెప్పినట్లు కేవలం ప్రత్యేక హోదా ,విభజన హామీ ల ప్రచారానికే హస్థినాపురానికి వచ్చారా? లేక కొన్ని కీలక వ్యవస్థలను తన నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ  రాజకీయ అనుభవాన్ని ప్రయోగించి మేనేజ్ చేయడానికి డిల్లీ వచ్చారా?  అని ప్రజల్లో ఇప్పటికే  సంశయాలు ముప్పిరిగొంటున్నాయి. అలాగే చంద్ర బాబు కొన్ని రహస్య సమావేశాలు కూడా జరిపారని ఆయన అంటున్నారు.అవి నిజమే అయితే సమీప భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని రాజకీయ ,పాలన, పార్టీల అనుసంధాన పరమైన నూతన, వింత, వినూత్న పరిణామాలు జరగవవచ్చునని భావిస్తున్నారు. ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికే చంద్రబాబు  లాబీయింగ్ ప్రక్రియ ప్రారంభించారని అబిప్రాయం కలుగుతుంది. ఏమి జరుగుతుందో? చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: