చరణ్... బుచ్చి కాంబో మూవీ స్టార్ట్ అయ్యేది ఆ నెల నుండి..?

Pulgam Srinivas
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన మూవీ దర్శకుడు బుచ్చిబాబు సన కాంబో లో మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపించనుండగా ... కన్నడ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ మూవీ పూజా కార్యక్రమాలకు రామ్ చరణ్ , బుచ్చిబాబు లతో పాటు జాన్వి కపూర్ , ఏ ఆర్ రెహమాన్ కూడా విచ్చేశారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మూడు పాటలను కూడా రెహమాన్ అందించినట్లు ఓ ఈవెంట్ లో ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చెంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ఈ నెల చివరి వరకు మొత్తం కంప్లీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దానితో వచ్చే నెల నుండి రామ్ చరణ్ , బుచ్చిబాబు కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ ని వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ , సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: