బ్లూ కలర్ డ్రెస్ లో క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న అంజలి..!

Pulgam Srinivas
జర్నీ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకుంది అంజలి. ఈ మూవీ కంటే ముందు ఈమె కొన్ని సినిమాలలో నటించినప్పటికీ వాటి ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. తమిళ్ లో రూపొందిన జర్నీ సినిమా తెలుగు లో కూడా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. దానితో ఈమెకు టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత ఈమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో వెంకటేష్ కి జోడి గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , అందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత వరుసగా ఈ బ్యూటీ కి తెలుగు లో అవకాశాలు పెరిగాయి.
 

ఇకపోతే తాజాగా ఈమె గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ దాదాపు పది సంవత్సరాల క్రితం విడుదల అయినటువంటి గీతాంజలి అనే మూవీ కి సీక్వెల్ గా రూపొందింది. ప్రస్తుతం ఈమె రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ లోను , విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లోనూ నటిస్తోంది. ఇకపోతే సినిమాల్లో ఎన్నో సందర్భాలలో తన అందాలను ఆరబోసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఓలకబోస్తోంది.
 

అందులో భాగంగా తాజాగా అంజలి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని క్యూట్ స్మైల్ తో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. అంజలి ప్రస్తుతం నటిస్తున్న గేమ్ చేంజర్ , గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలు మంచి విజయాలను అందుకున్నట్లు అయితే ఈమె క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: