కేసీఆర్ తో కలిసేవారెవరు దూరం జరిగేవారెవరు

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్నికల కదనరంగంలో దూసుకెళుతోంది. 2014లో మొద‌లైన దాని జైత్ర‌యాత్ర కొన‌సాగుతూనే ఉంది. దేశంలోని 29రాష్ట్రాల్లో 21రాష్ట్రాలు బీజేపీ ఖాతాలోకి చేరిపోయాయి. "కాంగ్రెస్ ముక్త భార‌త్" అంటూ ప్రారంభించిన యాత్ర "వామపక్ష ముక్త భారత్" కూడా అయిపోయి ఇంకా ముందుకు కొనసాగుతుంది. ఇప్పుడు మ‌ధ్య‌, ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తంగా బీజేపీ పాగా వేసింది. ఇప్పుడు దానికి ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పాటు ఒడిశా, ప‌శ్చిమ‌ బెంగాల్ మాత్ర‌మే కొర‌క‌రాని కొయ్య‌గా మారాయి.

ప్ర‌స్తుతం కాంగ్రెస్ చేతిలో పంజాబ్, క‌ర్ణాట‌క  రాష్ట్రాలు మాత్రమే ఉండగా వామపక్షాలకు కేరళ మాత్ర‌మే మిగిలి పోయాయి.


ప‌శ్చిమ‌బంగా, ఒడిషా, ఢిల్లీ,  తెలంగాణ‌, కేర‌ళ ప్రాంతీయపార్టీల చేతిలో ఉన్నాయి. వ‌చ్చేఎన్నికల్లో క‌ర్నాట‌క, ప‌శ్చిమ బెంగాల్, ఒడిశాలో పాగావేయాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నా లు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి మూడో కూట‌మిపై చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. కాంగ్రెస్, బీజేపీల వెనుక జాతీయస్థాయిలో కొత్త శక్తి అవ సరం ఉందని, దేశంలో ప్రభలమైన మార్పు అత్యవసరమని విశ్లేషణ‌లు జోడించారు. మూడో ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తే, దానికి తానే నాయకత్వం వహిస్తానని చెప్పు కొచ్చారు. ఈ విషయంలో అందరినీ కలుపుకు పోవాలన్నారు.


ఈ మ‌ధ్య తెలుగు రాష్ట్రాల‌ మద్య సైతం సుహృద్భ్వాక పూర్వ వాతావ‌ర‌ణం నెల‌కొంది. బీజేపీ-టీడీపీ మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతున్న క్ర‌మంలో వారు విడిపోతే టీడీపీ తృతీయ కూట‌మి దిశ‌గా మొగ్గుచూపే అవ‌కాశాలే ఎక్కువ‌. అయితే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కెసీఅర్ నాయకత్వాన్ని అంగీక రించక పోవచ్చు. మరో వైపు ఒడిశాలో న‌వీన్ ప‌ట్నాయ‌క్ భాజ‌పా వైపు మొగ్గుచూపే ప‌రిస్థితులు క‌న‌బ‌డ‌టం లేదు.


అయితే దేశ‌వ్యాప్తంగా ఒకరాజకీయ ప్ర‌త్యామ్నాయ అధికారవ్య‌వ‌స్థ ఏర్పాటు దిశ‌గా ఆలోచిస్తే మాత్రం కేసీఆర్ లాంటి వ్య‌క్తితో క‌లిసొచ్చేదెవ‌రు అన్న ప్ర‌శ్న త‌లెత్త‌క తప్ప‌దు. వామ‌ప‌క్ష పార్టీలు, పశ్చిమ బంగా సీఎం మ‌మతా బెన‌ర్జీ, త‌మిళ‌నాడు నుంచి డీఎంకే నేత స్టాలిన్, యూపీలో ములాయం-అఖిలేష్‌, మాయావ‌తి, బీహార్‌లో లాలూ, అలా అంద‌రితో క‌లిసి వెళ్లే ప్ర‌య‌త్నాల‌ను కేసీఆర్ ఇప్ప‌టికే మొద‌లుపెట్టి ఉంటార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.


అయితే త‌మిళ‌నాడు విష‌యానికి వ‌స్తే ఆ రాష్ట్రంలో అధికారంలోకి రాక‌పోయినా త‌న గుప్పిట్లో ఉంచుకోవాల‌ని బీజేపీ కాచుక్కుర్చోని ఉంది. ఆ దిశ‌లో ఇప్ప‌టికే స్టాలిన్‌తో బీజేపీ హైక‌మాండ్ ట‌చ్‌లో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రో వైపు కాంగ్రెస్ సైతం డీఎంకేతో జ‌ట్టుక‌ట్టేందుకు స్టాలిన్‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు త‌న ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. బీహార్ విష‌యానికి వ‌స్తే నితీష్ కుమార్ ఇప్ప‌టికే బీజేపీ పార్టీ వెంటే ఉన్నారు.


మ‌మ‌తా, న‌వీన్ ప‌ట్నాయ‌క్ కేసీఆర్ సిద్దాంతాల‌తో ఏకీభ‌విస్తారో లేదో తెలియ‌దు కానీ, క‌లిసి న‌డుస్తారా అంటే సందేహమే. దేశ‌వ్యాప్తంగా బీజేపీ పాల‌నప‌ట్ల ప్ర‌జ‌లంతా సంతృప్తిగా ఉన్నార‌ని అయితే అది క‌చ్చితంగా చెప్ప‌లేని ప‌రిస్థితి. అందుక‌నే బీజేపీని ఎదుర్కొనే విధంగానే ప్రాంతీయ పార్టీలు ఏకమవుతున్నాయనే సంకేతాలు మాత్రం క‌న‌ప‌డుతున్నాయి. మ‌రీ ఈ పార్టీల‌తో క‌లిసి కాంగ్రెస్ కూడా న‌డుస్తుందో లేదో వేచి చూడాలి. అదే జరగక పోతే మూడో ఫ్రంట్ వలన ప్రయోజనం మాత్రం బిజెపికే అంటు న్నారు ఎన్నికల విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: