ఛీ..వీడు అసలు ఉపాధ్యాయుడేనా..విద్యార్థినుల బట్టలు విప్పమని..!

Edari Rama Krishna
ఉపాధ్యయుడు అంటే..తల్లిదండ్రుల తర్వాత గొప్పగా పూజించే వ్యక్తి అని అంటారు.  గురు బ్రహ్మా..గురు విష్ణు..గురు దేవో మహేశ్వరః అంటారు. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి వారి భవిష్యత్ కి బంగారు బాట వేసేవారు ఉపాధ్యాయులు. అలాంటి ఉన్నత స్థానంలో ఉన్న కొంత మంది ఉపాధ్యాయుడు కామాంధుల్లా ప్రవర్తిస్తున్నారు.  మైనర్ అని కూడా చూడకుండా విద్యార్థినులపై లైంగిక వేధింపులు..అత్యాచారాలకు పాల్పపడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. 

కొన్ని కళాశాలల్లో విద్యార్థినిలు లొంగకుంటే..ప్రాక్టికల్స్ లో ఫెయిల్ చేయిస్తానని బెదిరించి మరీ అత్యాచారాలకు వొడిగడుతున్నారు.  తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు.   స్కూల్ డ్రస్ కొలతల పేరుతో విద్యార్థులను బట్టలు విప్పమని వేధించాడు.  యూనిఫాం కోసం కొలతలు తీసుకోవాలి అంటూ ఒక్కో విద్యార్థినిని తరగతి గదిలోకి పిలిచి వేధించాడు.

మీరు మీ బట్టలు విప్పండి అని ఆదేశించాడు.  ఉపాధ్యాయుడు చేస్తున్న నీచమైన పనికి విద్యార్థులు హడలిపోయారు..ఎలాగో అల ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, పోలీసుల దృష్టికి విద్యార్థినులు తీసుకెళ్లారు. ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. 



A teacher of a government school in Kannauj's Jalalpur Katri Banger village allegedly stripped a Class 8th student on pretext of taking her measurements for new uniform, allegations confirmed by other students of the school. Case registered, accused arrested. (19.02.2018) pic.twitter.com/MjK869GcUk

— ANI UP (@ANINewsUP) February 20, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: