చంద్ర‌బాబు జైలుకు వెళ్తే పార్టీకి చాలా మంచిది: ఉండ‌వ‌ల్లి



చంద్రబాబు ఈ మధ్య జైలుకు పంపబడతారని ముఖ్యంగా నిధులకోసం నరెంద్ర మోడీ పై వత్తిడి తెస్తే వరసగా ఉన్న అనేక కేసుల్లో ఒక్కటి చాలు మోదీ చంద్రబాబును జైలుకు పంపటానికి అంటున్నారు విశ్లేషకులు

ఉదాహరణకు.... 

అమరావతి భూదందా
ఫైబర్-గ్రిడ్ స్కాం
ఓటుకు నోటు కేసు
పొలవరంలో దాగుందన్న స్కాం 
స్విస్ చాలెంజ్ 
వివిధ న్యాయస్థానాల్లో వివిధ కేసులపై 18 స్టేలు 
ఏఏఐ టెండర్
రెండులక్షల కోట్ల అప్పుల లెక్కలు 


అయితే మాట‌ల శతఘ్నులను పేల్చే కాంగ్రెస్ నేత‌ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మోడీ కేసుల్లో ఇరికిస్తాడేమో అని చంద్ర‌బాబు భ‌య‌ ప‌డుతున్నార‌ని అంద‌రూ అంటున్నారు. అదే నిజ‌మైతే బాబు భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు. చంద్ర‌బాబు జైలుకు వెళ్తే న‌ష్టం మోడీకే. ప్ర‌జ‌ల‌కు సానుభూతి ఎక్కువ‌. టీడీపీని భారీ మెజార్టీతో గెలిపిస్తారు.  జైలు కెళ్ల‌డం ఈ కాలంలో త‌ప్పు లేదు. ఇంకో విష‌యం ఏంటంటే, అస‌లు ఓటుకు నోటు కేసులో భ‌య‌ప‌డాల్సిన ప‌నే లేదు. జైలుకు వెళ్లేంత పెద్ద త‌ప్పు చంద్ర‌బాబు చేయ‌లేద‌ని ఆయ‌న సూత్రీక‌రించారు.


ఒక వేళ కేంద్రం చంద్ర‌బాబు మీద క‌క్ష సాధిద్దామ‌ని ప్ర‌య‌త్నిస్తే అది చంద్ర‌బాబుకే మేలు చేస్తుంది గాని నష్టం క‌ల‌గ‌ద‌న్నారు అస‌లు ఈ స‌మ‌యంలో క‌నుక చంద్ర‌ బాబును జైలుకు పంపితే టీడీపీ అతి భారీ మెజార్టీతో మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, కాబ‌ట్టి చంద్ర‌బాబు జైలుకు వెళ్తే మంచిదే అని ఉండ‌వ‌ల్లి వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ చ‌రిత్ర గ‌మ‌నిస్తే, జైలుకు వెళ్ల‌డం వ‌ల్ల ఎంత లాభ‌మో చంద్ర‌బాబుకు అర్థ‌మ‌వుతుంద‌ని అన్నారు. జ‌గ‌న్ జైలుకు వెళ్ల‌డం వ‌ల్ల ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసింద‌ని, ఈ కాలం లో జైలుకు వెళ్లి వ‌చ్చిన వారికి ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ఉంద‌ని లాలూ నుంచి క‌నిమొళి వ‌ర‌కు ఇది ప్రూవ్ అయింద‌ని, చంద్ర‌ బాబు ఎదురొడ్డి పోరాడి అవ‌స‌ర‌మైతే జైలుకు వెళ్ల‌డానికి అయినా రెడీ కావాల‌న్నారు. తద్వారా తెలుగుదేశం తిరుగులేని శ‌క్తిగా ఎదుగుతుంద‌న్నారు. 


లోక్‌స‌భ‌లో మోడీ మెజార్టీ భారీగా ప‌డిపోయింది. ఆయ‌న‌కు సొంత మెజారిటీ లేద‌న్నారు. రాజస్థాన్ లో ఈ మ‌ధ్య‌నే రెండు కోల్పోయాక వారికి ఉన్న సీట్లు ఇపుడు కేవ‌లం 280 మాత్ర‌మే. ఇంకా ఎదురు తిర‌గ‌డానికి చాలామంది వేచి చూస్తున్నార‌ని ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స‌రిగ్గా ఆలోచిస్తే ఉండ‌వ‌ల్లి చెప్పింది నిజ‌మే అనిపిస్తుంది.


నరెంద్ర మోడీ ప్రభ క్రమంగా మసకబారుతుంది. తొలిదెబ్బ ఆయన స్వంత గుజరాత్ రాష్ట్రంలో తగిలింది ఆ పతనం రాజస్థాన్లో కూడా కొనసాగుతుంది. తమిళనాడులో తన సత్తా స్మాష్ అయింది. ఇలా అన్ ఏక ప్రాంతాల్లో మిత్రుల మధ్య కూడా మహారాష్ట్రలో శివసేన ఇప్పుడు ఏపిలో తెలుగుదేశం తో అదే పరిస్థితి కొనసాగుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: