సమ్మర్ తర్వాత రజనీ యాక్షన్ ప్లాన్ ఏంటో తెలుసా...?

Vasishta

రజనీకాంత్ ఎంట్రీతో తమిళ్ రాజకీయం కొత్త పుంతలు తొక్కే పరిస్థితి కనిపిస్తోంది. అవినీతి నిర్మూలనే ధ్యేయంగా.. ఆధ్యాత్మిక రాజకీయాలను తీసుకొస్తానన్నారు రజనీకాంత్. అదే సమయంలో భ్రష్టు పట్టిపోయిన రాజకీయాల్లో విప్లవత్మకమైన మార్పులు తెస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాల్లో రజనీ మునిగిపోతాడా.. లేక సినిమాల్లో కూడా కంటిన్యూ అవుతారా.. అనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న.


దేవుడు ఆదేశించాడు.. తమిళ్ తలైవా పాటించబోతున్నాడు.. భ్రష్టు పట్టిపోయిన తమిళ రాజకీయాలను ప్రక్షాళన చేసి విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలకబోతున్నాడు. ఇప్పటికే తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రజనీ త్వరలో పార్టీ, జెండా, ఎజెండాలను వెల్లడించబోతున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై కొంతకాలంగా  ఉన్న ఉత్కంఠకు తెరపడింది. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే ఆయన రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్టు ప్రకటించేశారు. రజనీ ప్రకటనతో ఇన్నాళ్లుగా తమిళ రాజకీయాల్లో నెలకొని ఉన్న అనిశ్చితి, రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చిందని చెప్పొచ్చు.


ప్రస్తుతం రజనీకాంత్ రోబో 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ క్లైమాక్స్ వచ్చింది. సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ డేట్ విషయంలో రజనీ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. ఇక మాఫియా బ్యాక్ డ్రాఫ్ లో తెరకెక్కిన కాలా కూడా రెండు నెలల గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ రెండు సినిమాల తరువాత రజనీ మళ్లీ సినిమాల్లో నటిస్తాడా.. లేదా అనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్ గానే మిగిలిపోయింది.


అయితే.. రజనీకాంత్ సన్నిహితులు చెప్పేదాన్ని బట్టి .. వచ్చే ఎన్నికల వరకూ రజనీకాంత్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతారని తెలుస్తోంది. సినిమాల్లో నటిస్తూ రాజకీయాలు చేస్తే ప్రజలు అంత సీరియస్ గా తీసుకునే అవకాశం ఉండదు. అందుకే పూర్తిస్థాయిలో రాజకీయాల్లో మునిగిపోవాలనుకుంటున్నారని తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయముంది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికలకు మాత్రం రజనీ పూర్తిస్థాయిలో ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తోంది. అందుకే తలైవర్ పూర్తిగా రాజకీయ దారినే ఎంచుకుంటున్నట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: