అర్థం కాని వైఎస్సార్ సిపి

Madhu

తెలంగాణ విషయంలో వైఎస్సార్ సిపి వ్యవహారం అంత గజిబిజిగా మారింది. షర్మిల పాదయాత్ర ముగింపు సభలో ఆపార్టీనేతలువిజయమ్మషర్మిల మాటలలో స్పష్టమైన తేడా కనిపించింది అంటున్నారు. మేకపాటి లాంటి వాళ్లు సైతం తెలంగాణ విషయంలో పార్టీ వైఖరి పాజిటివ్ అన్నారు.

విజయమ్మ కూడా అదే తరహాలో మాట్లాడింది. కాని షర్మిల ఏకంగా పాకిస్థాన్ తో పోల్చడంతో నాయకులువిజయమ్మ చేసిన ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరయింది అంటున్నారు. వైఎస్సార్ కు రెండు ప్రాంతాలంటే ఇష్టమనికేవలం ఇచ్చేముందు అందరిని సంప్రదించకపోవడం,సమస్యల పరిష్కారానికి సరైన దారి చూపక పోవడాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్థున్నామని నాయకులువిజయమ్మ చెప్పి తెలంగాణలో తమ పట్ల పుట్టిన వేడిని చల్లార్చే ప్రయత్నం చేసారు.

ఆతర్వాత ప్రసంగించిన షర్మిల మొదట్లో ఇలాగే ప్రారంభించి క్రమేపి మాటల వాడిని పెంచింది. తెలంగాణ ఇవ్వడం కాంగ్రేస్ సొత్తుకాదన్నట్టుగా మాట్లాడి ఎలా ఇస్థారో చూస్థాందానిని అడ్డుకుని తీరుతాం అంటూ హెచ్చరించింది. అంతే కాదు కేసిఆర్ ఎవ్వడుహైదరాబాద్ ఆయన అబ్బసొత్తా అంది. అంతవరకు కరెక్టే,అంతలోనే హైదరాబాద్ లో ఉండాలంటే పాకిస్థాన్ లో ఉండాల్సినంత పరిస్థిత తయారవుతుంది అంటూ భయంకరమైన వాఖ్య చేసి అందరి మతిపోగొట్టింది. దీంతో తెలంగాణ వారిని చల్లార్చడానికి చేసిన నాయకులువిజయమ్మ పడ్డ కష్టం అంతా షర్మిల మాటలతో గంగపాలయినట్టే అన్న అభిప్రాయం కూడా వ్యక్థం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: